ఆధార్ నమోదు కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియక, తెలిసినా.. ఉదయాన్నే ఇక్కడకు చేరుకుని బారెడు వున్న క్యూ కేంద్రాలలో గంటల కోద్ది నిలబడి.. చివరాఖరున తమకు టోకెన్ లభిస్తుందా లేదా..? అన్న విషయం తెలియక.. వస్తే హమ్మయ్య అని దేవుడ్ని తలచుకుని రాకపోతే మళ్లీ మరుసటి రోజునే ఇదే యుద్దంలో సైనికుడిలా పోరాటానికి రెడీ అయ్యే ప్రస్తుత పరిస్తితుల్లో మార్పులు రానున్నాయి, ఈ కష్టాల నుంచి అధార్ నమోదుకు, సవరణలు సులభతరం కానుంది. కొన్నేళ్ల ముందు వరకు మీ సేవా కేంద్రాల నుంచి సవరణలు జరిగినా ఆ తరువాత కేవలం ఎంపిక చేసిన కేంద్రాలకు మాత్రమే అనుమతులు లభించాయి.
దీంతో ఈ కష్టాలను అర్థం చేసుకున్న ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అధార్ కేంద్రాల నమోదును సులభతరం చేసేందుకు నడుంబిగించింది. ఇకపై అంగన్వాడీ కేంద్రాలన్నీ ఆధార్ సెంటర్లుగా మారబోతున్నాయి. మీ-సేవ కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు చేస్తున్నప్పటికీ.. గ్రామ స్థాయిలో ప్రజలంతా మండల కేంద్రాలు, సమీప పట్టణాలకు వెళ్లి ఆధార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో గ్రామీణ ప్రజలతో పాటు పట్టణ ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా చంటి పిల్లలున్న తల్లిదండ్రులు.. అనేక అవస్థలు పడుతున్నారు.
దీనికి తోడు ఆధార్ నమోదు కోసం రవాణా ఖర్చులు సామాన్యులకు భారంగా మారాయి. ఇక అక్కడ విద్యుత్ సరఫరా లేకపోతే అది కూడా వారికి శాపంగా పరిణమిస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకే ఆధార్ నమోదు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖకు ఆధార్ రిజిస్ట్రార్‌గా అధికారాలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ ఏజెన్సీల పర్యవేక్షణలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఆధార్ నమోదు బాధ్యతలు నిర్వహిస్తాయి.
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 25 ప్రాజెక్టులు పట్టణాల్లో, మరో 25 ప్రాజెక్టులు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో 35వేల 700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీవో (శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి)కు ఆధార్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించడంతో 149 ఆధార్ ఏజెన్సీలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతానికి ప్రతి గ్రామానికి ఒక కేంద్రం నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more