పోలీసులను రక్షకులుగా భావిస్తాం.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శభాష్ పోలీస్ అనేట్టు కూడా చేసిన రక్షక భటులు కూడా వున్న ఈ వ్యవస్థలోనే డబ్బుకోసం కక్కుర్తి పడి తిమ్మిని భమ్మిని చేసిన వారు లేకపోలేదు. ఇక తాజాగా వెలుగుచూసిన ఓ ఘటనలో వీడు పోలీసేనా.? పైశాచిక మృగమా.? అని యావత్ సమాజం ప్రశ్నించేలా.. సభ్య సమాజం తలదించుకునే చర్యలకు పాల్పడ్డాడు. కిడ్నాపైన బాలికను వెతికి పట్టుకుని.. తల్లిదండ్రులకు అప్పగించేందుకు బదులు ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా చంపేశాడు.
జమ్ముకశ్మీర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దర్యాప్తులో భాగంగా విచారించిన పోలీసులు సదరు పైశాచిక మృగం తోలు కప్పుకున్న పోలీసు అధికారిని కటకటాలు వెనక్కి నెట్టారు. పోలీసుల వివారాల ప్రకారం.. జమ్ముకు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే కతువా జిల్లా, రసనా గ్రామంలోని నోమాద్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలిక జనవరి 10న గుర్రాలను మేపుతుండగా కిడ్నాపైంది. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమెను వెతికిపట్టుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీములో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీవో) దీపక్ ఖుజారియా (28) కూడా ఉన్నాడు. ఈ క్రమంలో కిడ్నాప్ కు గురైన బాలికను గుర్తించిన ఖుజారియా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించకుండా వేరే ప్రాంతంలో అమెను వారం రోజుల పాటు బంధించి మరో బాలుడితో కలిసి బాలికపై అఘాయిత్యానికి ఒడిగ్గటాడు. అనంతరం బాలికను దారుణంగా హత్య చేసి పొలాల్లో పడేశాడు.
సరిగ్గా వారం తర్వాత జనవరి 17న పొలాల్లో కనిపించిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఈ ఘటన వెనక దీపక్ ఖజురియా హస్తం ఉందని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం, హత్య వెనుక దీపక్ హస్తం ఉందనేందుకు అన్ని సాక్ష్యాలు ఉన్నట్టు అదనపు డైరెక్టర్ జనరల్ అలోక్ పురి తెలిపారు. దీపక్ తన నేరాన్ని అంగీకరించినట్టు పేర్కొన్నారు. కాగా, తమకు న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు, నోమా తెగవారు ఆందోళన చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more