JFC will do it without bias: Pawan Kalyan జేఎఫ్సీ, జేఏసీలతో రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమిస్తాం: పవన్

Pawan kalyan explains how jfc and jac will do it without bias

Undavalli Arun Kumar, Jaya Prakash Narayan, JFC, JAC, Pawan Kalyan Press meet, Pawan Kalyan Union budger, Pawan Kalyan special package, pawan kalyan special status, pawan kalyan janasena, pawan kalyan, union budget, chandrababu, BJP, TDP, andhra pradesh, politics

Pawan Kalyan took to Twitter and demanded that why TDP leaders have agreed to Special Package then and now say it is not working.

జేఎఫ్సీ, జేఏసీలతో రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమిస్తాం: పవన్

Posted: 02/10/2018 02:36 PM IST
Pawan kalyan explains how jfc and jac will do it without bias

విభజన హామీలు అమలు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే అంశంపై రాజకీయాలకు అతీతంగా ప్రజాసంఘాలు, మేధావులతో ఐక్యఉద్యమ వేదికను ఏర్పాటు ఎలా చేస్తామన్న విషయాలను జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్‌ కల్యాన్ ఇవాళ మరోమారు వివరించారు. రాష్ట్ర విభజన జరిగి అన్యాయమైన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన కేంద్రం.. అది సాధ్యపడదని.. ఆంధ్రప్రదేశ్‌కి పత్యేక ప్యాకేజీని ప్రకటించగా అధికార టీడీపీ ప్రభుత్వం దానికి అంగీకరించిందిని పవన్ చెప్పారు.

అయితే ప్యాకేజీ అమలు చేయాల్సిన కేంద్రం ఇప్పుడు ఒక్కసారిగా వార్షిక బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం,  ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయని తీరును ప్రజలు తెలుసు కోవాలనుకుంటున్నారని పవన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య వివాదం నెల‌కొన్న అంశాల‌ను విస్తృతంగా చ‌ర్చించాల్సిన ఉందని, విభ‌జ‌న హామీల‌కు సంబంధించి సంయుక్త నిజ‌ నిర్ధార‌ణ క‌మిటీ (జేఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలని అన్నారు.

ఆర్థికవేత్త‌లు, ప్ర‌భుత్వ మాజీ అధికారులు, విద్యా వేత్త‌లు, సామాజిక, రాజ‌కీయ నాయ‌కులు తదిత‌రుల‌తో జేఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని అన్నారు. జేఎఫ్‌సీ ఏ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం, వివక్ష లేకుండా ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుందని చెప్పారు. అలాగే, జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. జేఎఫ్‌సీ అందించిన నివేదిక ప్రకారం జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ రాజకీయ కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Undavalli Arun Kumar  JP  JFC  JAC  andhra pradesh  politics  

Other Articles