కేంద్ర బడ్జెట్ లో నవ్యాంధ్ర రాష్ట్రానికి అరకొర నిధులు కేటాయించారని, అర్థిక లోటులో వున్న రాష్ట్రాన్ని అదుకోవాల్సిన అవసరం కేంద్రంపై వుందని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయ సభలను స్థంభింపజేయడం మొత్తానికి పార్టీలుగా విడిపోయినా ఎంపీలు మాత్రం తమ నిరసనను కేంద్రం దృష్టికి తీసుకురావడంలో విజయం సాధించనట్టే వున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే అర్థిక నిధులు, ఉపాధి నిధుల కింద సుమారు రూ.400 కోట్ల మేర విడుదల చేసిన కేంద్రం.. ఎంపీల డిమాండ్లకు దిగివచ్చింది.
ఈ క్రమంలోనే తరువాత టార్గెట్ తన శాఖనే చేస్తారని భావించిన కేంద్ర రైల్వే శాఖ కూడా ఈ క్రమంలో విశాఖ రైల్వే జోన్ కు పచ్చజెండాను ఊపినట్లు సమాచారం. వారం, పది రోజుల్లో ఈ మేరకు కేంద్రం రైల్వేశాఖ నుంచి ఒక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తుంది.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది. పరిధిని తగ్గించి జోన్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించిన కేంద్రం విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి కొత్త రైల్వే జోన్‌పై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో ప్రాథమిక ప్రకటనచేసి వారం రోజుల్లో బౌండరీస్ డిసైడ్ చేయనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉండాలని రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌ను కేంద్ర పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది.
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఒడిషా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మేంద్ర ప్రదాన్ విశాఖ జోన్ ఏర్పాటుతో తన సొంత రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని వాదించినట్లు తెలుస్తోంది. దాంతో ధర్మేంద్ర ప్రదాన్‌తో చర్చలు జరిపిన కేంద్ర పెద్దలు ఒడిషాకు ఎలాంటి నష్టం లేకుండా కొత్త జోన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించినట్లు చెబుతున్నారు. ఆ మేరకు వాల్తేరు డివిజన్‌లో 80శాతం ప్రస్తుత జోన్‌లోనే ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
ఏపీని సంతృప్తిపర్చడానికి ఇప్పటికిప్పుడు కొత్త రైల్వే జోన్‌పై ప్రాథమిక ప్రకటన చేసినా మార్చిలో కంప్లీట్ అనౌన్స్‌మెంట్ వస్తుందని అంటున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్‌లో ఏపీ ఎంపీల ఆందోళనతో దిగొస్తున్న బీజేపీ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటుపై ఒడిషా నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఒప్పించడంతో కేంద్రం సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకున్న సమాచారం మేరకు వాల్తేరు డివిజన్‌లో 80శాతాన్ని ఒడిషాకి వదిలిపెట్టి దక్షిణమధ్యరైల్వే పరిధిలోని గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more