Xi Jinping Try to Removing Presidential Limits | అధికారం కోసం రూల్స్ మార్చే పనిలో డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు

China to scrap presidential term limits

China, Presidential Term Limit, Communist Party, President Xi Jinping, Xi Jinping Term, Xi Jinping Parliament, China Parliament

China Proposes Lifting Presidential Term Limit. China's ruling Communist Party has proposed scrapping constitutional term limits for the country's president, which would give President Xi Jinping the option to stay on after the end of his second term in 2022. Critics see the move as reversing decades of efforts to create rules in China for the orderly exercise and transfer of political power.

అడ్డంకులను తొలగించుకునే పనిలో చైనా అధ్యక్షుడు

Posted: 02/26/2018 12:18 PM IST
China to scrap presidential term limits

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారం చేజారకుండా ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీపై తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకుంటున్న ఆయన త్వరలో ఓ కొత్త నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. పార్టీ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే అధ్యక్షుడిగా రెండు దఫాలు మాత్రమే కొనసాగే వీలుంది. ఇప్పుడు దీనికి ఆయన స్వస్థి చెప్పేందుకు ఆయన స్కెచ్ గీశాడు.

కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో తర్వాత అత్యంత శక్తిమంతమైన నేత హోదాను జిన్ పింగ్ కు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఇక రెండోసారి జిన్ పదవీకాలం ముగియకుండా రాజ్యాంగాన్ని సవరించాలని 205 మంది సభ్యులు ఉన్న కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్‌ కమిటీ ప్రతిపాదించినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ సవరణతో ఆయన అధికారానికి ఇక ఎదురుండదు. అధ్యక్షుడిగా ఆయన స్థానం మరింత పదిలం కానుంది. తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా ఎన్నేళ్లయినా ఆయన పదవిలో కొనసాగే వీలు కలుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles