Diamonds stolen from star hotel's honeymoon suite నక్షత్ర హోటల్ కు చుక్కలు చూపిన చోరులు..

Diamonds stolen from star hotel s honeymoon suite

Park Hyatt Hotel, Himayatnagar, Taj Falaknuma Palace, CCTV, banjara hills si, k ravi kumar, Banjara Hills police station, hyderabad police, venkat kuna rao, city businessman, crime

In a clear incident exposing loopholes in security apparatus at star hotels, a thief, posing as a customer, gained entry into the room of a newly-married couple at Park Hyatt Hotel at Banjara Hills and escaped with 12 lakh worth gold and diamond jewellery.

నక్షత్ర హోటల్ కు చుక్కలు చూపిన చోరులు..

Posted: 03/08/2018 10:41 AM IST
Diamonds stolen from star hotel s honeymoon suite

స్టార్ హోటల్ అంటే ఏంటి..? స్టార్స్.. (చుక్కలు) ఎక్కడ వుంటాయి..  అంటే బిల్లు కట్టేప్పుడు కనబడతాయని పలు హస్య సన్నివేశాలను ఇప్పటికే పలు చిత్రాలలో విన్నాం. అయితే ఇలాంటి ఓ నక్షత్ర హోటల్ కే చోరుడు చుక్కలు చూపించాడు. నమ్మశక్యంగా లేదా..? నిత్యం సిబ్బంది పహారా... అడుగడుగునా సిసీటీవీ కెమెరా నిఘా నేత్రాలు.. అయినా అత్యంత చాకచక్యంగా తన హోటల్ లోకి చోరబడి.. రూ. 12 లక్షల బంగారు అభరణాలతో ఉడాయించాడు. తన పనిని తాను ఎంచక్కా చక్కబెట్టుకుని వెళ్లాడు చోరుడు. తీరా విషయం అర్థం చేసుకున్న బాధితులు పిర్యాదు చేయడంతో నక్షత హోటల్ లోని భద్రతా డొల్లతనం బట్టబయలైంది.

వివరాల్లోకి వెళ్తే... హిమాయత్ నగర్ కు చెందిన వ్యాపారి వెంకట్ కునారావు(27) తన జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టిన జీవిత భాగస్వామి రిషికతో కలిసి ఈ నెల 5న బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో 312 గదిలో దిగాడు. తన భార్యతో కలసి 6న సాయంత్రం 6గంటలకు ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్ కు వెళ్లాడు. తమతో పాటు తెచ్చుకున్న రూ.12లక్షల విలువైన వజ్ర, బంగారు ఆభరణాలను హోటల్ గదిలోనే ఉంచి వెళ్లారు. 7వ తేదీన హోటల్ గదికి వచ్చి చూడగా అప్పటికే వారి గది తెరిచి ఉంది.. గదిలోని తమ సామాన్లు చెల్లాచెదురుగా పడివున్నాయి.. కంగారుపడి తమ వజ్ర,బంగారు అభరణాలను చూస్తే అవి కనిపించలేదు.

దీంతో హోటల్ సిబ్బందికి నిలదీయగా, వారు చేతులెత్తేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ ఫూటేజీని పరిశీలించి చోరుడ్ని గుర్తించారు. పార్క్‌హయత్‌ హోటల్ తో పాటు ఇటీవల ఓ స్టార్ హోటల్ లో జరిగిన సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించిన పోలీసులు దొంగలకు సంబంధించిన ఫూటేజీని సేకరించారు. స్టార్‌ హోటళ్ల లక్ష్యంగా పెట్టుకుని కస్టమర్ల మాదిరిగా డాబు ప్రదర్శిస్తూ.. చోరీలకు పాల్పడుతున్న దొంగను గుర్తించారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని చెబుతున్నారు. దొంగ నుంచి పెద్దఎత్తున సొత్తు రికవరీ కానుందని పోలీసులు అభిప్రాయడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles