ఎన్డీయే పాలకమండలిలోని మంత్రులు నోరుజారగడం పరిపాటిగా మారింది. ఒక్కో మంత్రి ఒక్కో అంశాన్ని టార్గెట్ చేసుకుని అనేక వివాదాస్పద వ్యాక్యలు చేస్తూ.. దేశ ప్రజల అగ్రహానికి కూడా గురయ్యారు. బాధ్యతాయుతమైన పదవులలో కొనసాగుతూ ఇంతటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక తాజాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దు అంశంలో దేశ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోకోగా, ఆ తరువాత దేశంలోని వ్యాపారస్థుల నుంచి జీఎస్టీ నేపథ్యంలో కూడా విమర్శల పాలయ్యారు.
ఇక తాజాగా, తెలుగు ప్రజలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు వున్నాయని తెలుగువారు మండిపడుతున్నారు. అసలే అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేసే విషయంలో ఇప్పటికే అంధ్ర రాష్ట్ర ప్రజలు కేంద్రంపై మండిపడుతున్న క్రమంలో.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు అగ్గికి అజ్యంపోసేలా వున్నాయి. ఇక అంధ్రులతో పాటు తెలంగాణవాసులను కలసి ఆయన వ్యాఖ్యలు చేశారన్న క్రమంలో.. అటు తెలంగాణ వాసులు కూడా అంధ్రులకు జతకలిసేలా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నోట్ల కట్టలను దాచుకుంటున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంతకీ విషయం ఏంటంటే..
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.. క్రితం రోజున అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజీ, నిధుల విషయం, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించిన ప్రకటనను పత్రికా ముఖంగా వెల్లడించారు. అయితే అదే సమయంలో అక్కడే వున్న తెలంగాణ బీజేపి నాయకురాలు పుష్పలీలా.. మీడియా ముఖంగా కేంద్రమంత్రి దృష్టికి తెలుగు రాష్ట్రాల్లోని ఏటీయం కేంద్రాలలో నగదు కొరత విషయాన్ని తీసుకువచ్చారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కూడా అన్నారు. పుష్పలీల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి తాము ఇప్పటికే పంపించాల్సిన డబ్బు కన్నా చాలా అధికంగానే కరెన్సీ నోట్లను అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపించానని చెప్పారు. ప్రజలు నోట్ల కట్టలను బ్యాంకు లాకర్లలో, ఇళ్లల్లో దాచుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more