రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని, అందుకోసం అన్ని వర్గాల వారి అభున్యతికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ముఖ్యఉద్దేశ్యమని అందుకు కట్డుబడే తమ బడ్జెట్ వుంటుందని ఆయన చెప్పారు. ఇవాళ అమరావతిలోని అసెంబ్లీలో బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. మొత్తంగా లక్ష 91 వేల 63 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా, లక్ష యాభై వలే 271 కోట్ల రూపాయలను అర్థిక లోటు వుందని యనమల గణంకాలను సభ ముందు పెట్టారు. గత ఏడాదితో పొల్చితే ఈ సారి 21.7శాతం బడ్జెట్ పెరిగిందని అంచనా వేశారు.
కేంద్రం నుంచి నిధులు రాక, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హామీలు అచరణ రూపం దాల్చకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని యనమల బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందాల్సిన సాయం అందకపోయినా.. ఒక చేత్తో అభివృద్ది.. మరో చేత్తో సంక్షేమాలను కొనసాగిస్తూ వస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజనతో అదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్ర ఆదాయాంపై పెను ప్రబావాన్ని చూపించదని, తీరని నష్టం కలిగించిందని అన్నారు. సమస్యల వలయంలో కూడా రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేశామని యనమల చెప్పారు. ఫలితంగా గత ఏడాది రాష్ట్రంలో 10.96 శాతం వృద్దిరేటు సాధించామని యనమల చెప్పుకోచ్చారు.
బడ్జెట్ లోని కీలక కేటాయింపులు ఇవే:
* వ్యవసాయానికి రూ.12,352కోట్లు
* సాగునీటి రంగానికి రూ.16,978.23కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు.
* ఇంధన రంగానికి రూ.5,052.54కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.3,074.87కోట్లు
* కార్మిక, ఉపాధి కల్పనకు రూ.902.19కోట్లు
* రవాణా శాఖకు రూ.4,653కోట్లు
* గృహ నిర్మాణ శాఖకు రూ.3,679కోట్లు
* సాధారణ సేవల కోసం రూ.56,113.17కోట్లు
* సమాచార, పౌర సంబంధాల శాఖకు రూ.224.81కోట్లు
* విద్యా రంగానికి రూ.24,185.75కోట్లు
* క్రీడలు, యువజన సేవల శాఖకు రూ.1,635.44 కోట్లు
* సాంకేతిక విద్యకు రూ.818.02కోట్లు
* కళ, సాంస్కృతిక రంగానికి రూ.94.98కోట్లు
* పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.4,100కోట్లు
* హోంశాఖకు రూ.6,226కోట్లు
* పర్యాటక శాఖకు రూ.290కోట్లు
* తాగునీరు, పారిశుద్ధ్యం కోసం రూ.2,623కోట్లు
* ఫైబర్ గ్రిడ్ కోసం రూ.600కోట్లు
* సామాజిక భద్రత కోసం రూ.3,029కోట్లు
* స్టార్టప్‌ల కోసం రూ.100కోట్లు
* ఎన్టీఆర్ జలసిరి కోసం రూ.100కోట్లు
సంక్షేమ దిశగా..
* బీసీ సంక్షేమానికి రూ.12,200కోట్లు
* కాపుల సంక్షేమానికి రూ.1,000కోట్లు
* నాయీ బ్రాహ్మణుల కోసం రూ.30కోట్లు
* వైశ్యుల సంక్షేమం కోసం రూ.30కోట్లు
* కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70కోట్లు
* మేదరుల సంక్షేమానికి రూ.30కోట్లు
* చేతివృత్తులకు ఆదరణ పథకానికి రూ.750 కోట్లు
* చేనేతలను ప్రోత్సహించేందుకు జనతా వస్త్రాల పథకం కింద రూ.250కోట్లు
* జనతా వస్త్రాల సరఫరా కోసం రూ.200కోట్లు
* చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.100కోట్లు, బీసీలకు రూ.100కోట్లు
* ఆర్థికంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు బోధన ఫీజు కోసం రూ.700కోట్లు
* కాపు సామాజిక విద్యార్థులకు రూ.400కోట్లు
* డ్వాక్రా మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్ల కోసం రూ.,100కోట్లు
* వారానికి ఐదు రోజులు గుడ్లు పథకానికి రూ.266కోట్లు
* పౌష్టకాహార లోపం నియంత్రణకు రూ.360కోట్లు
* మెడ్ టెక్ జోన్ కోసం రూ.270కోట్లు
* అన్నా క్యాంటీన్ల కోసం రూ.200కోట్లు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more