ప్రత్యేక హోదా వల్ల కలిగే లబ్ది కన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి ఎక్కువ లబ్ది చేకూరుతుందని ఇన్నాళ్లు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా మాత్రం ప్రత్యేక హోదా విషయాన్ని మళ్లి తెరపైకి తీసుకురావడం కావాలని బీజేపిని బద్నామ్ చేయడానికేనని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతోనే ఏపీకి లాభం చేకూరుతుందని ప్రత్యేకహోదాతో లాభం ఉండదని జైట్లీ చెప్పారని... జైట్లీ ప్రకటనను తప్పుగా అర్దం చేసుకుని టీడీపీ నేతలు సరికొత్త నాటకానికి తెరతీస్తూ ప్రజల ముందు బీజేపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కట్టుబడి వుందని.. అన్యాయానికి గురైన రాష్ట్రానికి కేంద్రం తప్పకుండా న్యాయం చేస్తుందని అమె స్పష్టం చేశారు. ఆర్థికలోటు పూడ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని...అయితే ఇంకా డిజైన్లు ఫైనల్ కాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలదన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అన్నారు. అంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలకు పన్ను రాయితీలు కొనసాగుతాయని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
కేంద్రం ఈ ఏడు జిల్లాలలో పన్ను రాయితీలను కల్పించడంతో.. ఆయా ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 14 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కూడా అమె గుర్తు చేశారు. ఇక గుంటూరు విజయవాడ ప్రాంతాలు రాజధానితో అనుసంధానించబడి వున్న కారణంగా అయా ప్రాంతాల్లోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపర్చేందుకు కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే పనులు ప్రారంభించిన రాష్ట్రం అర్థాంతరంగా వాటిని అపేసిందని.. ఈ విషయంలో ఏకీభవించని మీడియా మిత్రులతో కలసి తాను ఈ పనులను పరిశీలించేందుకు కూడా సిద్దమని అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్యను ఇరు పార్టీల అధ్యక్షులు చూసుకుంటారని చెప్పారు. కేంద్రం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తామని పురందేశ్వరి అన్నారు. కేంద్రం ఏ పనులను చేయలేదో రాష్ట్రప్రభుత్వం చెప్పగలదా..? అని అమె సూటిగా ప్రశ్నించారు.,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more