senior leader madasu quits congress, joins janasena జనసేనలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. ఏపీసీసీ పదవికి రాజీనామా..

Set back to congress senior leader madasu quits party joins janasena

madasu gangadharam, apcc vice president, set back to congress, congress senior leader joins jana sena, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journey, pawan kalyan, janasena, kondagattu temple, karimnagar, telangana, andhra pradesh, politics

Apparently its a set back for the congress party which is already weak in andhra pradesh, as its senior leader madasu gangadhram quits party and resigned for the APCC vice president post and joined jana sena party in the presence of Actor turned politician Jana Sena chief pawan kalyan.

జనసేనలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. ఏపీసీసీ పదవికి రాజీనామా..

Posted: 03/09/2018 06:03 PM IST
Set back to congress senior leader madasu quits party joins janasena

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసి ఆ ప్రాంతంలోని పార్టీలతో పాటు ప్రజలకు కూడా దూరమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పడప్పుడే కొలుకునేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన సీనియర్ నేతల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు ఎందరెందరో పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లారు. కాగా, వున్న నాయకులతోనే పార్టీని ముందుకు నడిపిస్తున్న క్రమంలో మరోమారు ఎన్నికల సీజన్ వచ్చేసరికి మిగిలిన అరకొర నేతలు కూడా పలాయనం చిత్తగిస్తూ.. పార్టీకి తేరుకోలేని షాక్ ఇస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఏపీ పిసిసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు జనసేన పార్టీ దృవీకరిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాదాసు గంగాధరం తమ పార్టీలో చేరారని, ఆయనను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాధరంగా పార్టీలోకి అహ్వానించారని జ‌న‌సేన మీడియా హెడ్ హరిప్రసాద్ పేరిట ప్రెస్ నోట్ విడుదల చేశారు.

సుదీర్ఘ‌కాలంగా ప్ర‌జా జీవితంలో ఉండి, ఎమ్మెల్సీగా రెండు ద‌ఫాలు ప‌నిచేసిన గంగాధ‌రాన్ని తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు పవన్ కల్యాణ్ తెలిపినట్లు అందులో పేర్కొన్నారు. తనకు 30 ఏళ్ల నుంచి గంగాధరంతో పరిచయం ఉన్న నేపథ్యంలో అతన్ని తమ పార్టీలో చేరాలని పవన్ కల్యాన్ అహ్వానించారని.. పవన్ అహ్వానం మేరకు గంగాధరం ఇవాళ పార్టీలో చేరారని పార్టీ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కోన్నారు. గంగాధరం సుదీర్ఘ రాజకీయ అనుభవం, సలహాలు, సూచనలు పార్టీ అభివృద్దికి దోహదపడతాయని అశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ పార్టీలో చేరిన మాదాసు గంగాధరానికి పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ మ‌హాస‌భ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌కు పవన్ కల్యాన్ అప్ప‌గించారని పార్టీ ప్రెస్ నోట్ లో పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  press note  madasu gangadharam  apcc vice president  andhra pradesh  politics  

Other Articles