pawan kalyan question chandrababu on nara lokesh corruption లోకేష్ అవినీతి కనిపించడం లేదా చంద్రబాబుగారు.?

Pawan kalyan question chandrababu on nara lokesh corruption

Pawan Kalyan foundation day speech, pawan kalyan jana sena foundation day, jana sena nagarjuna university, jana sena foundation day guntur, jana sena foundation day mangalagiri, #Pawan Kalyan inkenni gaayalu, pawan kalyan motivational song, pawan kalyan emotional song, jana sena foundation day, Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, andhra pradesh, politics

janasena party chief power star pawan kalyan question chandrababu on nara lokesh corruption..? Asks wheather he is aware of it or knowlying welcoming it..?

లోకేష్ అవినీతి కనిపించడం లేదా చంద్రబాబుగారు.?

Posted: 03/14/2018 07:42 PM IST
Pawan kalyan question chandrababu on nara lokesh corruption

అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన మాటల యుద్ధంతో తెలుగు ప్రజలను ఆలోచనలో పడేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గుంటూరు సభలో ఏపీలో అధికారంలోకి టీడీపీని, ప్రతిపక్షంలోని వైసీపీని ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కోసం తెలుగు దేశం పార్టీతో చేతులు కలిపామే తప్ప.. తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణానికి కాదు అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్న అవినీతిని ప్రజల సాక్షిగా ఎండగట్టారు.

పవన్ కళ్యాణ్ మాటల్లో ముఖ్యాంశాలు:

* ప్రతీ నియోజక వర్గానికి పాతిక కోట్లు పెట్టేశాం. అన్నీ సర్దేశాం అని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
* ప్రకాశం పంతులు, ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. వీళ్లకు ఈ అవినీతి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.
* సీఎం గారూ... మీ అబ్బాయి నేరుగా చేస్తున్న అవినీతి మీకు తెలుసా లేదా.. తెలిసే చేయిస్తున్నారా లేదా.. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు వ్యక్తిగతంగా మీ మీద చాలా గౌరవం వుంది. కానీ మీ అనుభవం... ఆంధ్ర ప్రదేశ్‌లో అవినీతి లో నంబర్ వన్ స్థానంలో వుంది.
* ఇదేనా మనం సాధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. సీఎంకు పట్టులేదా.. లేక తెలిసే చేస్తున్నారా.  అయితే

* 2019లో సరికొత్త నాయకున్ని ఎన్నికుని తీరుతారు. 2014 ఎన్నికలంత సుఖంగా 2019 ఎన్నికలు వుండవు.
* అమరావతి రైతుల భూములు తీసుకున్నారు. వాళ్లకిచ్చిన పట్టాలు చెల్లుతాయా లేదా అనే భయంతో రైతులు బతుకుతున్నారు.
* మీ అవినీతి అంటే అంత భయపడుతున్నారు.
* ఫాతిమా కాలేజీ విద్యార్థులు చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీ యాజమాన్యం మోసం చేస్తే వాళ్లకే అండగా ఉన్నారని, నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వం విఫలమైందనడానికి ఫాతిమా కాలేజీ విద్యార్థులే నిదర్శనమన్నారు.* తమిళనాడు అన్నాడీఎంకే నేత శేఖర్ రెడ్డి వ్యవహారంలో కూడా లోకేష్ పేరు వినిపించిందని, అందుచేతే చంద్రబాబుకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న వార్తలు కూడా రాజకీయవర్గాల్లో షికార్లు కొడుతున్నాయి.. ఇది నిజమేనా అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles