pawan kalyan targets chandrababu on corruption చంద్రబాబు అవినీతిని ఏకిపారేసిన పవన్ కల్యాన్..?

Pawan kalyan targets chandrababu on corruption

Pawan Kalyan foundation day speech, pawan kalyan jana sena foundation day, jana sena nagarjuna university, jana sena foundation day guntur, jana sena foundation day mangalagiri, #Pawan Kalyan inkenni gaayalu, pawan kalyan motivational song, pawan kalyan emotional song, jana sena foundation day, Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, andhra pradesh, politics

janasena party chief power star pawan kalyan targets chandrababu and his government on high level of corruption..? Asks why the government cant take action on mla who attacks mro vanjakshi.?

చంద్రబాబు అవినీతిని ఏకిపారేసిన పవన్ కల్యాన్..?

Posted: 03/14/2018 08:05 PM IST
Pawan kalyan targets chandrababu on corruption

జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సునిషిత విమర్శలు గుప్పించారు. నేరుగా చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నాగార్జునా యూనివర్శిటీ అవరణలోని సభావేదిక సాక్షిగా చంద్రబాబు తన తనయుడి కోసమే కేంద్రంతో రాజీపడుతున్నారని అరోపించారు. రాష్ట్రాన్ని అవినీతి అంధ్రప్రదేశ్ గా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసిందని అరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం అంధ్రప్రదేశ్ అవినీతిలో ప్రధమస్థానంలో వుందని ఇది రాష్ట్రానికే సిగ్గుచేటని విమర్శించారు. పాలించాలంటే పెట్టిపుట్టాలా..? అని ప్రశ్నించారు.

అయితే రాష్ట్ర విభజన తరువాత అనుభవంతులైన వారు కావాలని మీకు 2014లో మద్దుత ఇచ్చామని అన్నారు. అయితే మీ అనుభవమంతా కేవలం రాష్ట్రాన్ని దోపిడి చేసుకోవడానికే ఉపయోగిస్తున్నారని అరోపించారు. ఇందుకా తాను 2014లో టీడీపీకి మద్దుతు ఇచ్చానా..? అని అవేదన వ్యక్తం చేశారు. ఇందుకేనా మీకు 2019లో పక్కన నిలబడాలా..? అని ప్రశ్నించారు. తెలిసి చేసినా తెలియక చేసినా రెండు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని అన్నారు. ఇదే పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి 2019 ఎన్నికలలో కొత్త పార్టీలు, కొత్త నాయకులను ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు. అయితే రానున్న 2019 ఎన్నికలు మాత్రం టీడీపీకి అంత సులువైనవి కావని అన్నారు.

ఓటుకు నోటు విషయంలో సీఎం చంద్రబాబును గుడ్డిగా సపోర్ట్‌ చేశానని, తనను జర్నలిస్టులే ప్రశ్నించారని పవన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్తగా వచ్చిన రాష్ట్రం.. కుళ్లిపోయిన వ్యవస్థలో అవినీతి అంతో ఇంతో ఉండడం సహజమని ఉపేక్షించానన్నారు. చట్టం తన పని చేసుకుపోతోందని కూడా ఊరుకున్నానన్నారు. ఇంత జరిగాక కూడా టీడీపీ మారలేదని ఆరోపించారు. ఆరేళ్లలో 75 కోట్లు సంపాదించా.. పాతిక కోట్ల పన్ను కట్టానని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికలలో వైసీపీని ఎదుర్కోవాలని, అందుకనే అవినీతికి పాల్పడుతున్నామని భరితెగించి చెబుతున్నవాళ్లతో ఇంకా ఏమి మాట్లాడగలనిమని చెప్పారు.

ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి లారీ ఇసుకను రూ.15 వేల రూపాయలకు పెంచారని ఇదే టీడీపీ ప్రభుత్వం పేదలకు, సామాన్యులకు ఇచ్చిన బహుమానం అని వ్యంగస్త్రాలను సంధించారు. ఎర్రచందనం అమ్మకాలతో రాష్ట్రాన్నికి పాతిక వేల కోట్ల రూపాయల అదాయం వస్తుందని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం నిధులివ్వడం లేదని అంగలార్చడం ఏం లాభమని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఎర్రచందనం ఏమైందని, అవి అమ్మితే కనీసం 15 వేల కోట్ల రూపాయల అదాయం కూడా రాష్ట్రానికి రాలేదని అన్నారు. టీడీపి అన్యాయాలను, అవినీతి చూసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మ ఎంతగానో భాదపడుతుందని అన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అత్మ ఎంతగానో క్షోభిస్తుందని అన్నారు.
 
ప్రజలను కాపాడని ప్రభుత్వంతో స్నేహం చేయబోనని పవన్ తేల్చిచెప్పారు. పవన్ కల్యాన్ లాంటి వాడు మీకు మద్దతు ఇచ్చి.. ఒక టెండరు అడగలేదు.. ఒక టెండరు ఇప్పించలేదని, ఒక పదవి అడగలేదు.. ఒక పదవి ఇప్పించలేదని అన్నారు. అలాంటి పవన్ కేవలం ప్రజా సమస్యలను తీర్చాలని కోరితే సమస్యల పట్ల నిర్లక్ష్యంగా, తాత్సరంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఇప్పటికీ ఉద్దానం సమస్య అలానే ఉంది. చేయాల్సింది కొండంత ఉందని పవన్ అవేదన వ్యక్తం చేశారు.

* అభివృద్ధి, అధికారం అనేది కొందరికి కాదు.. అందరికీ. అధికారం కొన్ని కులాల గుప్పిట్లోనేనా.. కుదరదు. అన్ని కులాలకు న్యాయమైన వాటా దక్కాలి.
* ప్రజలు వలస వెళ్తారు...నాయకులు ఎందుకు వలస వెళ్లరు. రాయలసీమ వెనుకబాటుకు ఆక్కడి రాజకీయ వ్యవస్థే కారణం. సీమ వెతలు వింటుంటే కడుపు తరుక్కుపోతోంది.
* ముఖ్యమంత్రి కూడా రాయలసీమకు చెందినవారే. సీమ విషయంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. దశబ్దాలుగా పాలకవర్గాల తప్పులకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి.
* 29 సార్లు ఢిల్లీ వెళ్లాం.. ప్రధాని పట్టించుకోవడం లేదన్న ముఖ్యమంత్రి... మన బంగారం మంచిదైతే ఎందుకు పట్టించుకోరని పవన్ కల్యాన్ ప్రశ్నించారు.
* రూ. 1.50లక్షల కోట్ల బడ్జెట్‌ను పందేరం చేస్తానని ప్రజలను నమ్మించగలరు’’ అంటూ పవన్ చంద్రబాబును ప్రశ్నించారు.
* మహిళా అధికారినిపై దాడి చేసిన ఎమ్మెల్యేను సమర్ధించుకుని వెనకేసుకోస్తారా..? దీంతో అధికారులకు మీరు ప్రభుత్వంతో సర్థుకుపోవాలన్న సందేశాన్ని ఇస్తున్నారా..? అని పవన్ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles