సమకాలిన రాజకీయ వ్యవస్థలో అణచివేతకు గురై ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న అన్నదమ్ములకు, అడపడచులకు అండగా జనసేన పోరాడుతుందని, రాష్ట్రాభివృద్దిలో అనుభవజ్ఞులైనవారు వుంటే శరవేగంగా జరుగుతుందని చంద్రబాబుకు గత ఎన్నికలలో మద్దతు ఇచ్చాను కానీ.. టీడీపీ పునర్నిర్మాణానికి కాదని.. టీడీపీ దోపిడికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని గుంటూరు జిల్లా మంగళగిరలోని నాగార్జునా యూనివర్శటి అవరణలోని మైదానంలో జరిగిన జనసేన పార్టీ వ్యవస్థాపక సభలో పవర్ స్టార్ పవన్ కల్యాన్ అరోపించడం పట్ల అంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
తమ పార్టీని దెబ్బతీయాలని మహాకుట్ర జరుగుతోందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఉభయసభల్లో గత ఎనమిది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ.. టీడీపీని దెబ్బతీయడానికి కేంద్రం బ్లేమ్ గేమ్ ప్రారంభించిందని అరోపించారు. ఈ కుట్ర పథక రచనలో చాలా మంది పెద్దలున్నారని, ఇలాంటి ఎన్నో కుట్రలను గతంలో తమ పార్టీ సమర్ధంగా ఎదుర్కొందని చంద్రబాబు అన్నారు. ప్రత్యర్ధుల కుట్రలను ప్రజలే తిరస్కరిస్తారని, తమ పార్టీకి ప్రజలే రక్షకభటులని, పార్టీని, రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకుంటారని ఆయన అన్నారు.
ఇకపై తాము కూడా టీడీపీని బలహీనపర్చాలన్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడతామని అన్నారు. ఇకపై కేంద్రంతో యుద్దం చేస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ తో అమరణ నిరాహర దీక్ష చేయించి కేంద్రం ప్రత్యేక హోదాను ఇస్తుందని, అలాగే విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ కూడా ప్రకటిస్తుందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. బీజేపి డైరెక్షన్ లోనే పవన్ వ్యవస్థాపక సభ స్వీచ్ వుందని విమర్శించారు. లాలూచీ రాజకీయాలను ప్రజలు సహించరని, తెలుగుదేశం పార్టీపై కుట్రలను ప్రజలే తిప్పికొడతారని సీఎం అన్నారు.
ఇక తమపై ఆరోపణలు గుప్పించిన పవన్ కల్యాణ్‌పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. టీడీపీ సభ్యులు, శ్రేణులు చేసే విమర్శలు హుందాగానే ఉండాలని అన్నారు. ఎవరు నన్ను తిట్టినా, తిట్టించినా అవి తనకు, తన పార్టీకి ఆశీర్వాదాలే అవుతాయని అభిప్రాయపడ్డారు. కాగా పార్టీపై పవన్ కల్యాన్ అవినీతి అరోపణలు చేసిన నేపథ్యంలో.. ఎవరూ ఆవేశకామేశాలకు లోనుకారాదని చంద్రబాబు సూచించారు. ఇది కీలక సమయం అని, మన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more