జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి.. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎంట్రీకి సిద్దమవుతున్న క్రమంలో క్రితం రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జునా యూనివర్శిటీ అవరణలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలో.. గత ఎన్నికలలో మద్దతు ప్రకటించిన రాష్ట్రంలోని అధికార పార్టీ టీడీపీపై అరోపణలు గుప్పించి రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా వేడిపుట్టించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్.. ఇవాళ కూడా మంగళగిరిలోనే బిజీ బిజీగా గడిపారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది వరకు మంగళగిరిలోనే వుంటానని చెప్పిన పవన్.. పార్టీ బలోపేత కార్యక్రమాలను చేపడుతున్నారు.
నిన్నటి సభకు విచ్చేసిన ఎన్ఆర్ఐ వింగ్ పార్టీ శ్రేణులతో పవన్ ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...ఎన్ఆర్ఐలను పార్టీకి నిధుల బ్యాంకుగా అన్ని పార్టీలు పరిగణిస్తున్నాయని, అయితే తమ పార్టీలో మాత్రం ఎన్ఆర్ఐలను బ్యాంకుగా చూడబోమని స్పష్టం చేశారు. అయితే ఎన్ఆర్ఐ వింగ్ శ్రేణులు పార్టీ నెట్ వర్కింగ్ లో సహాయపడాలని పవన్ కల్యాన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైల సహాయం ఎంతో అవసరమని తెలిపారు. ఎన్నారైల నెట్ వర్కింగ్ ను రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా వుండాలని పవన్ కల్యాణ్ అకాంక్షించారు.
ఎన్నారైల ప్రొత్సాహం, సహకారం జనసేనకు చాలా అవసరమని పవన్ అన్నారు. అయితే తాను కావాలని తప్పులు చేయనని... ఒకవేళ తెలియక తప్పు చేస్తే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరతానని అన్నారు. తాను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడతానని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విబేధాలు లేవన్నారు. కాగా ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను, పార్టీ నిర్మాణాన్ని ఎన్ఆర్ఐలకు పవన్ కల్యాణ్ వివరించారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్నారై కార్యకర్తలు పవన్ కల్యాన్ తో కరాచలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. ఈ భేటీ అనంతరం వామపక్ష నేతలతో సమావేశం కానున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more