తెలంగాణలోని తమ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని అర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పునరుద్ఘాటించారు. రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక పథకంగా పేరొందిన రైతు లక్ష్మీ పథకాన్ని కూడా ఏప్రీల్ 19 నుంచి అమలు చేస్తున్నామని ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా అన్నదాతలకు సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు.
ఈ పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రైతలకు ఏకరానికి రూ.8000 చోప్పున పంటల పెట్టుబడికి ముందు అర్థికసాయాన్ని అందిస్తుందని చెప్పారు. ఇందుకోసం ఈ వార్షిక బడ్జెట్ లో రూ.12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. దీంతో ఖరీఫ్, రబీ కాలానికి ముందు రైతన్నలకు ఇది అందుతుందని అన్నారు. అయితే ఈ మేరకు రైతులకు నేరుగా వారి పేర్లపై చెక్కులు అందుతాయని చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితీ అధ్వర్యంలో నిర్వహిస్తుందని, దీనికి గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మెన్ గా వ్యవహరిస్తారని ఈటెల చెప్పారు.
అయితే సన్నకారు, చిన్నకారు రైతులలో కూడా అనేక మంది తమ భూములను కౌలుకు ఇచ్చారని.. ఈ పథకంలో రైతులకు లాభం చేకూరుతుంది కానీ కౌలు రైతులకు మాత్రం ఏలాంటి ప్రయోజనం చూకూరదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం పథకాలను డిజైన్ చేసేప్పుడు భూములను సాగు చేస్తున్న వారి వివరాలను కూడా తీసుకుని వారికే నేరుగా సాయం అందేలా చేస్తే బాగుంటుందని రైతుసంఘాలు సూచిస్తున్నారు. ఇక కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకంలో భాగం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
* పంట పెట్టుబడి పథకానికి - రూ. 12వేల కోట్లు
* రైతు బీమా పథకానికి - రూ. 500 కోట్లు
* వ్యవసాయం, మార్కెటింగ్ కు - రూ. 15,780 కోట్లు
* పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కు - రూ. 120 కోట్లు
* వరంగల్ నగర అభివృద్ధికి - రూ. 300 కోట్లు
* పట్టణాభివృద్ధికి - రూ. 7,251 కోట్లు
* రోడ్లు భవనాల శాఖకు - రూ. 5,575 కోట్లు
* ఎస్సీ ప్రగతికి రూ.16,453కోట్లు
* ఎస్టీ ప్రగతి నిధికి రూ.9,693కోట్లు
* సాంస్కృతిక శాఖకు రూ.58కోట్లు
* దళితులకు మూడెకరాల భూ పంపిణీకి రూ.1,469కోట్లు
* ఎస్టీల సంక్షేమానికి రూ.8,063కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.5,920కోట్లు
* ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more