ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై అధికార టీడీపీ, విపక్ష టీడీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణం డైలీసీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలోకి రావడం… గంధరగోళం మధ్య అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టలేనని చెప్పి వాయిదా వేసి వెళ్లిపోవడాన్ని గత ఐదు రోజులుగా చూస్తున్న దేశప్రజలకు మరీ ముఖ్యంగా దక్షిణాధి ప్రజలకు ఇది రుచించడం లేదు.
కావేరీ బోర్డు ఏర్పాటుపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో నిమిషాల్లోనే లోక్‌సభ వాయిదా పడుతోంది. ఈ క్రమంలో మరుసటి రోజున అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరపాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు నోటీసులు కూడా ఇస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఇదే సీన్ ప్రతిరోజూ ఉత్పన్నం కావడంతో బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఇక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు కనబడవన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఐదో రోజూ అదే పరిస్థితిలు ఉత్పన్నమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు ఆందోళనకు దిగారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభంచమని చెబుతుండగానే తమ సమస్యలకు పరిష్కారానికి కోరుతూ రెండు పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. మరో వైపు టీడీపీ, వైసీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టినా ఫలితం లేకపోయింది. దీంతో సభ ప్రారంభమైన నిమిషంలోపే వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్.
ఇక వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైన పరిస్థితి మారలేదు… స్పీకర్ ఎంత సర్దిచెప్పినప్పటికీ అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు పట్టువీడలేదు… వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ఇస్తూ నిరసనకు దిగారు. పార్లమెంటు వ్యవహరాల శాఖా మంత్రి అనంత్‌కుమార్ నిరసనలు విరమించాలని, అన్ని సమస్యలపై కేంద్రం చర్చిస్తుందని విన్నవించారు. సభ్యులు సహకరిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు.
ఈ సమయంలోనే మరికొంత మంది ఎంపీలతో మాట్లాడించే ప్రయత్నం స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసినా.. అవిశ్వాసంపై చర్చకు మాత్రం జరగలేదు. దీంతో తమ అవిశ్వాస తీర్మాణాలపై ముందుగా చర్చ జరపాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ స్థానాల్లో నిలిచొని నిరసన వ్యక్తం చేశారు… ఓ వైపు టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారానికి వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more