ఆంధ్రప్రదేశ్ లోని అధికార, విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాలపై గత ఆరు రోజులుగా పార్లమెంటు ఉభయసభల్లో చర్చకు నోచుకోకుండా పోయిన తరుణంలో ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలన్నింటినీ ఏకం చేస్తుంది కాంగ్రెస్. దీంతో తానే స్వయంగా తానే స్వయంగా రంగంలోకి దిగింది.
ఈ మేరకు ఆ పార్టీ లోక్ సభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కార్యాలయానికి పంపారు. మంగళవారం సభా కార్యకలాపాలకు సంబంధించిన జాబితాలో తమ అవిశ్వాస నోటీసును చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఖర్గేను కలిసి వైసీపీ సభ్యులు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని లోక్ సభ కారిడార్ లో కలిసి కోరడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చే ముందు తమ మద్దతు కోరాల్సింది పోయి వారం రోజుల తరువాత సపోర్టు చేయడమనడం ఆయను అసంతృప్తికి గురిచేసింది.
కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కలిసి చర్చించాక ఖర్గే కార్యాలయం నుంచి అవిశ్వాస నోటీసును స్పీకర్ సుమిత్రా మహజన్ కార్యాలయానికి పంపారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, రోజుకో బ్యాంకు కుంభకోణం వెలుగుచూస్తోందని, రాఫెల్ విమానాల కొనుగోళ్లలో అక్రమాల సహా అనేక అంశాలపై చర్చ జరగాల్సి వుందని పేర్కోన్నారు. తాము పెట్టిన తీర్మానాన్ని మంగళవారం సభా కార్యకలాపాల జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. ఇందుకోసం సభను సజావుగా సాగేలా చూడాలని స్పీకర్ను కోరనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more