నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో వరుసగా అరు రోజుల నుంచి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుండగా, ఆ అంశాన్ని చర్చకు రానీయకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సైంధవుడిలా అడ్డుకుంటున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణలోని టీఆర్ఎస్, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలు ఆంధ్రప్రదేశ్ పాలిట శిఖండి పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. నాడు మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయేందుకు పోట్టి శ్రీరాములు ప్రాణాలను బలి తీసుకున్న తమిళనాడు.. హైదరాబాద్ నుంచి అసంబద్దంగా గెంట్టివేత గురైన నేపథ్యంలో రాష్ట్ర అమాయక యువత ప్రాణాలను బలిగొన్న తెలంగాణ.. కలసి ఇప్పుడు మరోమారు అంధ్రప్రదేశ్ పై కక్ష సాధిస్తున్నాయని రామకృష్ణ విమర్శించారు.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేసీఆర్ పై ఏపీ ప్రజలు ప్రేమను పెంచుకున్నా.. ఆయన మాత్రం వారి పాలిట సైందవుడిలా అడ్డుపడుతున్నారని అన్నారు. కేంద్రంపై ఫెడరల్ ఫ్రంట్ తో పోరాటం అంటున్న కేసీఆర్ మాటల్లో నిజంగా చిత్తశుద్ది వుంటే అవిశ్వాసానికి ఆయన సహకరించాలని డిమాండ్ చేశారు. నంగనాచి మాటలు చెబుతున్న కేసీఆర్, బీజేపీతో లాలూచీ పడ్డారని, మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఈ నెల 27న అంబేద్కర్ విగ్రహాల వద్ద రాజ్యాంగ పరిరక్షణ దినం పాటిస్తామని రామకృష్ణ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more