తనను ప్రేమించిన ప్రేయసిని వంచించిడంతో పాటు స్నేహితుల గదికి తీసుకెళ్లి వారితో కలసి అమెపై సామూహిక అత్యాచారం చేసిన ఓ మగమృగంతో పాటు అతనికి సహకరించిన పైశాచిక మృగాలకు పోలీసులు వినూత్న రీతిలో శిక్ష విధించారు. సామూహిత అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను బోఫాల్ లోని మహారాణా ప్రతాప్ నగర్ లో ఊరేగించారు. అందరు చూస్తుండగా వారి రోడ్డుపై నడిపించారు. ఇలా నడిపించిన తరువాత ఓ కూడళి వద్దకు చేరుకోగానే అక్కడ ఈ నలుగురు కామాంధుల్ని కోపంతో రగలిపోతున్న మహిళలనకు అప్పగించారు.
అంతే ఇంకేముందు అక్కడ గుమ్మిగూడిన మహిళలు వారిని ఉతికి అరేశారు. లాఠీలతో వారిపై తమ ప్రతాపాన్ని చూపారు. రేపిస్టులను సమాజానికి దూరంగా వుంచుతూ. ప్రత్యేకంగా రక్షణ కల్పించి.. అదే పోలీసు బందోబస్తు మధ్య కోర్టుకు అక్కడి నుంచి రిమాండ్ కు తరలించడంతో.. వారిలో పరివర్తన రాకపోవడంతో పాటు.. బెయిల్ పై విడుదలైన తరువాత మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్న సత్యాన్ని గ్రహించిన పోలీసులు వీరిని నడివీధిలో ఉరేగించి.. మహిళల చేత ఉతికి అరేయిస్తే.. కనీసం తమను కన్నవారి పరువు ప్రతిష్టలను తీయకూడదన్న సందేశం యువకులల్లోకి వెళ్తుందని బావించి ఇలాంటి శిక్షను విధించారు.
పోలీసులు తీసుకున్న చర్యలపై నెట్ జనులలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది ఆనందం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం అమానవీయ చర్యలకు పాల్పడిన వీరిని బట్టలతో కాకుండా కేవలం లోదస్తుల్లో ఊరేగించి వుంటే బాగుండేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారు నిజంగా శిక్షార్హులే.. అయితే వీరి పరువు ప్రతిష్టల నేపథ్యంలో అమాయకమైన వారి కుటుంబసభ్యులు, అడపడుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. నిందితుల్లో ఒకరైన శైలేంద్ర దాంగి అనే యువకుడితో అతని జూనియర్ అయిన విద్యార్థిని ప్రేమలో పడింది. అయితే అమెను కలిసేందుకు స్థానికంగా వున్న ఓ రెస్టారెంటుకు అతను వచ్చాడు. బాధితురాలితో ఏదో విషయమై గొడవపడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫోన్ ను లాక్కున్నాడు. ఇలా కాదు తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని అమెను అప్సరా ధియేటర్ వద్దనున్న తన స్నేహితుడు సోను ధంగీ ఇంటికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ ధీరజ్ రాజ్ పుత్, చిమన్ రాజ్ పుత్ అనే ఇద్దరు స్నేహితులు కూడా వున్నారు.
వారిని చూసి లోనికి వచ్చేందుకు సంశయించిన బాధితురాలిపి బలవంతంగా గదిలోకి తీసుకెళ్లిన ప్రియుడు తన స్నేహితులతో కలసి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. అదివారం రోజుల విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని చెబితే తనతో పాటు తన కుటుంబాన్ని హతమారుస్తామని నిందితులు హెచ్చిరించినా.. బాధితురాలు నేరుగా మహారాణా ప్రతాప్ పోలిస్ స్టేషన్ కు వెళ్లి నిందితులపై పిర్యాదు చేసింది. దీంతో నలుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అమెను వైద్యపరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు. నిందితులపై సామూహిక అత్యాచారం, రేప్, కిడ్నాప్ కేసులతో పాటు నిర్భయ కేసు పెట్టామని, కఠిన శిక్ష పడేలా చూస్తామని డీఐజీ చౌదరీ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more