ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేయాలని గత నాలుగేళ్లుగా గుర్తుచేస్తున్నా.. అవసరం లేదు.. అది ముగిసిపోయిన అంశం.. దాని కన్నా ప్యాకేజీయే ముఖ్యం అంటూ ఇన్నాళ్లు విలువైన కాలన్ని కాలగర్భంలో కలపి.. ఇప్పుడు మేల్కోన్నట్లుగా నటిస్తూ.. కేంద్రంపై యుద్దానికి సై అంటూ అవేశపూరిత ప్రసంగాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ మినహా ఏ పార్టీ నుంచి మద్దతు లభించలేదు. ఎందుకంటారా.. ప్రత్యేక హోదా విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఆయన నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించగా, దానికి కాంగ్రెస్ మినహా ఏ పార్టీ నుంచి మద్దతు లభించలేదు. ఇన్నాళ్లు కేంద్రంతో పోరాడితే ఏం సాధించలేమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడెలా పోరాటానికి సిద్దమయ్యారని ప్రశ్నిస్తూ.. అనుకూలంగా వుంటే ఏకపక్షం.. లేదంటే అఖిలపక్షం అంటూ ఎద్దేవా చేసిన వైసీపీ, తమపైనే పోరా అని బీజేపి దూరంగా వున్నాయి.
ఇక గత ఎన్నికలలో రొట్టె విరిగి నేతిలో పడిందన్న చందంగా కేవలం ఐదు లక్షల ఓట్లతో అధికారాన్ని అందుకున్న చంద్రబాబుకు.. ఆధికార పీఠాన్ని అందించింది మాత్రం కేవలం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ మాత్రమేనన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఇటీవల టీడీపీపై విమర్శలు చేయడంతో ఆయన కూడా బీజేపితో లోపాయికార ఒప్పందం చేసుకుని తమను టార్గెట్ చేస్తున్నారని విమర్శలు గుప్పించడంతో జనసేన కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరుకామని తేల్చిచెప్పింది. ఈ సమావేశాన్ని ఓ రాజకీయ ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖను యథాతథంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.
ఏ పని చేయాలన్నా దానికి సంకల్పం బలంగా ఉండాలని అప్పుడే ఫలితం గొప్పగా ఉంటుందని మన పెద్దలు అంటారని, అయితే సీఎం చంద్రబాబు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి సంకల్పమే లోపించిందని విమర్శించారు. నిశిరాత్రి వేళ.. మంగళవారం సమావేశానికి రమ్మని అనుచరులతో ఆయన కబురు పంపారు. తొలుత ఈ సమావేశం అఖిల సంఘాలకు మాత్రమే అని ప్రచారం చేసి, చివరికి పనిలో పనిగా రాజకీయ పార్టీలను కూడా కలిపేశారు. దీనిని కూడా టీడీపి రాజకీయ ఎత్తుగడగానే జనసేన భావిస్తోందని అరోపించారు.
ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను అశగా ఎదురుచూస్తూ,, నాలుగేళ్లవరకు దక్కక అగ్రహంతో రగిలిపోతున్న ప్రజలను మభ్యపెట్టడానికే అఖిలపక్ష డ్రామా అని ఆయన అరోపించారు. ప్రజలను వంచించే ఎటువంటి చర్యనైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించుకుందని అన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ సర్కారుపై మూడేళ్ళ కిందటే అఖిలపక్ష ఏర్పాటు చేసివుంటే బాగుండేందని, ఎన్నికల ముందు మాత్రమే టీడీపీ ఎందుకీ డ్రామాలు అడుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆగ్రహం తెలిసిన టీడీపీ.. తమ పాపాన్ని మాకు పంచాలని కుట్రలో భాగమే అఖిలపక్షమని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే చర్యలను ఎవరు చేసినా.. ఆ పార్టీలతో సంబంధంలేకుండా జనసేన మద్దుతునిస్తుందని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగేళ్లు నాన్చిన ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులే హోదా సాధించే భారాన్ని మోయాలన్నారు.. ఇందుకోసం ఆయన ప్రజాప్రతినిధులతో కలసి ఢిల్లీ బాట పట్టడమే మిగిలిన అప్షన్ గా పవన్ అభిప్రాయపడ్డారు. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగాలని పవన్ సూచించారు. తమిళ రైతులు ఢిల్లీ నడి వీధిలో చేసిన ఆందోళన స్ఫూర్తిగా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలన్నారు. ఇదంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసికట్టుగా చేయవలసిన ప్రజాకార్యమన్నారు. ఎందుకంటే, తమ ఓట్లుతో గెలిచి ఐదేళ్లకు అదికారమివ్వగా నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ఇదోక్కటే అప్షన్ అని జనసేనాని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more