ఆడవాళ్లను వంటింటి కుందేళ్లుగా మార్చిన మగవాడు.. పైశాచిక మృగమై కామంతో మీదపడితే.. ఏంచేయాలో తెలియని మహిళ.. వాడిని ఎదురించలేక.. మగమృగం కామదాహానికి బలైన ఘటనలు అనేకం వెలుగుచూస్తున్న క్రమంలో.. తనపై లైంగిక వేధింపులకు దిగిన ముగ్గురు ఆకతాయిలను ఓ యువతి ఎదురించి వారికి బుద్ది చెప్పడం.. చర్చనీయాంశంగా మారింది. యువతి ఒంటి చేత్తో ముగ్గురు కామాంధులకు బుద్ది చెప్పడమే కాకుండా వారిని పోలీసులకు కూడా అప్పగించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. దీంతో యువతి ధైర్యాన్ని తెగువ స్థానికులు, పోలీసులు అభినందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్ లోని బిర్ భూమ్ జిల్లాలోగల సైంత్యా మున్సిఫాలిటీలోని వార్డు నెంబర్ 11లోగల కమర్ పరా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి అభ్యస్థిస్తుంది. కాగా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు దగ్గర్లోని దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అమె ఒంటరిగా వెళ్లడాన్ని చూసిన స్థానికులైన ముగ్గురు యువకులు అమిత్ సహాని, దిప్ మండల్, భాస్కర్ మండల్ లు అమెను అడ్డుకుని వేధింపులకు పాల్పడ్డారు. వారిలో ఒకడు ఇంకాస్త ముందుకు వెళ్లి ఆమె చేతిని పట్టుకుని, అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. దీంతో వారిని వారించి, హెచ్చరించిన యువతి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది.
అయితే అమె హెచ్చరికలను తేలిగ్గా తీసిపారేసిన యువకులు.. అమెను కూడా అబల అనుకున్నారు.. తాము ముగ్గురం వున్నాం.. అమె ఒక్కతే అనుకుని.. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ విద్యార్థిని తనకు తెలిసిన కళను ప్రదర్శించింది. మార్షల్ ఆర్ట్స్ లో అమె నేర్చుకున్న విద్యను ప్రదర్శించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన అరుపులు విన్న స్థానికుడు అనిర్ బర్ సేన్ అక్కడకు వెళ్లగా ఆ యువతి చేతితో దెబ్బలు తిన్న ముగ్గురు యువకులను అమె కిందపడేసి.. దుమ్ముదులుపింది. ఆమె తెగువను చూసిన అనిర్ బర్... యువతులు ఆమెను స్పూర్తిగా తీసుకోవాలని సూచించాడు.
దీంతో యువతి తన తల్లితో కలసి వెళ్లి పోలీసులకు విషయాన్ని చెప్పి.. జరిగిన ఘటనపై పిర్యాదు చేసి.. వారిని అరెస్టు చేయించింది. దీంతో స్థానికులు, పోలీసులు ఆమె ధైర్య సాహసాలను అభినందిస్తున్నారు. అంతేకాదు యువతులను అబలలుగా కాకుండా.. వంటింటికి మాత్రమే పరిమితం చేయకుండా వారిని మార్షల్ అర్ట్స్ వైపు కూడా ప్రోత్సహించాలని పోలీసులు పిలుపునిచ్చారు. మార్షల్ అర్ట్స్ వచ్చినందనే యువతి ముగ్గురు యువకులను చావచితకకొట్టి తమకు అప్పగించిందని, లేని పక్షంలో మరో ఘోరం నమోదయ్యేదని పోలీసులు యువతిని ప్రశంసిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more