తెలుగు న్యూస్ ఛానెల్ లో న్యూస్ ప్రెజంటర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రముఖ యాంకర్ రాధిక అదివారం అర్థిరాత్రి అత్మహత్యకు పాల్పడినటం వెనుక కారణాలు ఏమిటీ..? అన్న కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. v6 ఛానల్ లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్న ఆమె ఆదివారం రాత్రి తన విధులు ముగించుకుని.. కార్యాలయం నుంచి ఇంటికి చేరుకున్న కొద్ది సేపటికే ఆమె ఈ అఘాయిత్యం పాల్పడటం వెనుక అసలు కారణాలు ఏమిటీ అన్నది పోలీసులకు అంతుచిక్కని ప్రశ్న. అమె సహచరులు, లేక ఇంటి వద్ద ఇరుగుపోరుగువారు, లేక బంధువులు ఇలా ఎవరి నుంచో అమె అత్మనున్యతా బావాన్ని ఎదుర్కొని వుంటారని.. అందుచేతే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడ్డారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇక ఆమె మరణించేందుకు ముందు రాసిపెట్టుకున్న సూసైట్ నోట్ పై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమె సూసైడ్ నోట్ ఎక్కడ రాసుకుందన్న విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్, ముసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని సుశీల్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆమె ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రాధిక ఆత్మహత్యకు పాల్పడేంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నా.. విధులను సక్రమంగా ఎలా నిర్వహించారాన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అమె సూసైడ్ నోట్ లో తన మరణానికి ఎవరూ కారణం కాదుని తన అలోచనలే (మైండ్) తన శత్రువని కూడా రాయడం పలు ప్రశ్నలకు తావిస్తుంది.
ఆరు నెలల కిందట భర్తతో విడాకులు తీసుకున్న రాధిక.. భర్తకు దూరమైనందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా.? అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి అదే అపార్టుమెంటులో ఉంటున్న అమె.. భర్త దూరం కావడంతో కొన్నాళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కాసేపటికే పరుగుపరుగున అపార్ట్మెంట్ పైకి వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. కీడు శంకించి వారు పైకి వెళ్లేలోపే ఆమె పై నుంచి దూకి ఆత్మహత్య పాల్పడటంపై స్థానికులను విషాదంలో ముంచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more