పార్లమెంటులో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు చివరి వారానికి చేరుకున్న నేపథ్యంలోనూ ఎలాంటి మార్పు లేకుండా ఉభయ సభలు మంగళవారినికి వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు పార్లమెంటు ఉభయసభలు కొనసాగుతాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ వారాంతపు సెలవుల అనంతరం ప్రారంభమైన పార్లమెంటు ఉబయసభల్లో ఇవాళ కూడా సభాకార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మన్ వెంకయ్యనాయుడు అందోళనకారులను తమ స్థానాల్లో కూర్చోవాలని పదే పదే విన్నవించినా వారు లక్ష్యపెట్టకపోవడం.. సభలో నినాదాలు ఇవ్వడంతో ఆయన సభను రేపటి వాయిదా వేశారు.
ఇక ఇటు లోక్ సభలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మాణాలను ఇచ్చినా.. వాటిపై ఎలాంటి చర్చ లేకుండా మరోమారు వరుసగా తొమ్మిదవ పర్యాయం లోక్ సభ వాయిదా పడింది. కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు.. ఇటు అంధ్రప్రదేశ్ కు చెందిన అధికార టీడీపీ, విపక్ష వైసీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణంపై తొమ్మిదవ రోజు కూడా షరామామూలుగానే వాయిదా పడింది. రోజూ సాగే తంతుమాదిరిగానే లోక్ సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు అందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆ తరువాత 12 గంటలకు తిరిగి ప్రారంభమైన సభలో కూడా మార్పు లేకపోవడంతో సభ ఏప్రిల్ 3 మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్.
ఈ క్రమంలో రెండో పర్యాయం ప్రారంభమైన లోక్ సభలో తమకు పలు పార్టీల నుంచి అవిశ్వాస తీర్మాణాలు అందాయని సభలో ప్రకటించిన స్పీకర్ సుమిత్రా మహాజన్.. వాటిపై చర్చించాలని.. అందుకు సభ్యులందరూ తమ స్థానాల్లో అసీనులు కావాలని అప్పుడే తాను అవిశ్వాససభ్యుల సంఖ్యను లెక్కించగలుగుతానని చెప్పారు. అయితే కావేరి నది జలాల బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తూ.. వెల్ లోకి దూసుకువచ్చి నినాదాలు చేయడంతో.. అమె సభను వాయిదా వేశారు.
అంతకుముందు బీజేపి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ జోక్యం చేసుకుని తమ ప్రభుత్వం అవిశ్వాసంపై సిద్దంగా వుందని అన్నారు. అయితే సభలో విపక్షంగా వున్న కాంగ్రెస్ కావాలని 70 ఏళ్లుగా అధికారంలో వుండి.. తప్పుడు విధానాలతో సభను అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వంపై పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా వుందని, నరేంద్రమోడీకి సభలోనూ, సభ భయట దేశంలోనూ ప్రజల మద్దతు వుందని చెప్పారు. ఆ తరువాత కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే మాట్లాడుతూ.. తమ అవిశ్వాస తీర్మాణాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చకు సిద్దమేనంటూ ప్రకటిస్తూనే.. సభనుంచి పారిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more