ఇప్పటికే కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఉత్తరాదిపై వరాల జల్లు కురిపిస్తుంటే.. ఇటు దక్షిణాది రాష్ట్రాలపై మాత్రం వివక్ష చూపుతుందని అరోపిస్తూ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో కలసి పోరాటానికి కూడా వేదికను సిద్దం చేసేందుకు యత్నించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఆ రాష్ట్ర ప్రజలు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో వున్న యడ్యూరప్ప ప్రభుత్వంతో పొల్చితే సిద్దరామయ్య ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు చాలా తక్కువని కర్ణాటకా ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో కర్ణాటకలో మరోమారు అధికారాన్ని చేపట్టి తమ సత్తా చాటుకోవాలని యత్నిస్తున్న బీజేపి ఆశలు అవిరవుతున్నాయి.
కేంద్రంలోని మోడీ సర్కర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు.. బీజేపి నేతలు ఎప్పటికప్పుడు చేసే విమర్శలను కూడా తిప్పికొడుతూ కర్ణాటక రాజకీయాలలో తనదైన ముద్రవేసుకున్న సిద్దరామయ్యా.. మరోమారు అధికారంలోకి రావడం ఖాయమని ఓటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో అత్యధికులు ఆయనకే జై కోడుతున్నారు. ఆయన పాలనను భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు. పాలన తీరు, అమలు చేస్తున్న పథకాలకు ఎక్కువమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ పదిమందిలో ఏడుమంది ఆయన పాలన భేష్ అంటున్నారు.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), దక్ష్ సంస్థలు నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. డిసెంబరు 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్య రాష్ట్రంలోని 224 శాసనసభ నియోజకవర్గాల్లో 13,244 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ప్రతి పదిమంది ఓటర్లలో ఏడుగురు సిద్ధరామయ్య ప్రభుత్వానికి జై కొట్టారు. రాష్ట్రంలో కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు ఎక్కడా జరగలేదని, సిద్ధరామయ్య బాగా పనిచేస్తున్నారని అత్యధికులు కితాబిచ్చారు. కాగా, కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపి ఈ దఫా కూడా అధికారం అందని ద్రాక్షాగానే మిగులుతుందా.? వేచి చూడాల్సిందే మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more