బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల ఓ వృద్ద ప్యాసింజర్ పై ముష్టిగాతాలకు పాల్పడి.. కిందపడేసి మరీ దాడి చేసిన విమానయాన సంస్థగా పేరొంది.. ప్యాసింజర్లను కష్టపెట్టడంలో కానీ లేక ఇబ్బందులకు గురిచేయడంలో కానీ విమర్శలను ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థల్లో ముందున్న సంస్థ ఇండిగో అని కూడా నెట్ జనులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఈ సంస్థ స్టాప్ లో మాత్రం కాసింతైనా మార్పు కోసం యత్నించడం లేదు. తాజాగా విమానంలో దోమలున్నాయని చెప్పినందుకు తనను కొట్టి గెంటేశారని ఓ ప్రయాణికుడు ఆరోపించాడు. వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన సౌరభ్ రాయ్ అనే ప్రయాణికుడు లక్నో విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఇండిగో విమానయాన సంస్థలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే విమానంలోకి ఎక్కగానే దోమలు ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి ఫిర్యాదు చేశారు. కాగా.. విమాన సిబ్బంది ఫిర్యాదును పట్టించుకోలేదు సరికదా తనపై చేయిచేసుకున్నారని సౌరభ్ ఆరోపించారు. అంతేగాక తనను విమానం నుంచి దింపేశారని పేర్కొన్నారు.
అయితే దీనిపై ఇండిగో కూడా వివరణ ఇచ్చింది. సదరు ప్రయాణికుడు హైజాక్ లాంటి పదాలు ఉపయోగించాడని.. భద్రతా కారణాల దృష్ట్యా అతన్ని విమానం నుంచి దింపేశామని పేర్కొంది. ‘సౌరభ్ విమానంలోకి ఎక్కగానే దోమలు ఎక్కువగా ఉన్నాయంటూ ఫిర్యాదు చేశాడు. విమాన సిబ్బంది స్పందించేలోపే ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక విమానం తలుపు మూసివేయగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విమానాన్ని ధ్వంసం చేద్దామంటూ మిగతా ప్రయాణికులను రెచ్చగొట్టాడు. హైజాక్ లాంటి పదాలను ఉపయోగించాడు. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆయనను విమానం నుంచి దింపేశాం’ అని ఇండిగో తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more