CBI Carries Out Searches At Rabri Devi's Residence రబ్రీదేవి ఇంట్లో సీబిఐ సోదాలు..

Cbi carries out searches at rabri devi s residence questions tejashwi yadav

rabridevi, cbi searches, rabridevi's residence, cbi questions tejashwi yadav, railway hotel tender case, cbi questions, tejashwi yadav, railway hotel, tender case, PM Modi, Bihar

The CBI carried out searches at former Bihar chief minister Rabri Devi's Patna residence and questioned son Tejashwi Yadav for more than four hours over the railway hotel tender case

లాలూ కుటుంబానికి మరిన్ని చిక్కులు.. సీబీఐ సోదాలు..

Posted: 04/10/2018 04:08 PM IST
Cbi carries out searches at rabri devi s residence questions tejashwi yadav

రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే దాణ కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న క్రమంలో ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా మరిన్ని కష్టాల్లో చిక్కుకుంది. ఆయన సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి చెందిన పాట్నా నివాసంలో సీబిఐ అధికారులు సోదాలు నిర్వహించి, కుమారుడు తేజస్వి యాదవ్ ను సీబీఐ మంగళవారం ప్రశ్నించింది.

రై్ల్వే హోటళ్ల టెండర్ కేసులో ఐఆర్సీటీసీకి చెందిన రాంచీ, పూరీల్లోని రెండు రైల్వే హోటళ్ళను అప్పనంగా సుజాతా హోటల్స్ వారికి ఎలా కట్టబెట్టారన్న విషయమై వారిని సీబిఐ విచారించినట్లు సమాచారం. ఈ కేసులో కూడా లాలూను దోషిగా నిరూపించాలని సీబిఐ కంఖణం కట్టుకుంది. అయితే ఇందులో కుటుంబసభ్యుల ప్రమేయం కూడా వుందా..? లేదా..? అన్న విషయాలు వెలుగులోకి రానప్పటికీ.. వారిపై కూడా సీబిఐ కేసులు నమోదు చేసి విచారించనుందా..? అన్న అనుమానాలు రాష్ట్రంలో ఉత్కంఠకు దారితీస్తున్నాయి.
 
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీ అనే రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ళను సుజాత హోటల్‌కు చట్ట విరుద్ధంగా కట్టబెట్టినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. వినయ్ కొచ్చార్, విజయ్ కొచ్చార్ యాజమాన్యంలో సుజాత హోటల్ నడుస్తోంది. లాలూపై సీబీఐ ఛార్జిషీటు 2017 జూలై 7న నమోదైంది. ఈ హోటళ్ళను కొచ్చార్లకు కట్టబెట్టడానికి లాలూ ప్రసాద్ యాదవ్ తన పదవిని దుర్వినియోగపరచినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ హోటళ్ళను కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా అత్యంత విలువైన భూమిని లాలూ స్వీకరించారని తెలిపింది. డిలైట్ మార్కెటింగ్ కంపెనీ అనే బినామీ కంపెనీ పేరుతో ఈ భూమిని స్వీకరించినట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles