Hung assembly in Karnataka says India Today pre-poll కాంగ్రెస్ పై వ్యతిరేకత లేదు, కానీ.. హంగ్

Hung assembly in karnataka says india today pre poll

karnataka assembly elections 2018, karnataka assembly polls 2018, karnataka assembly polls 2018 results, india today group-karvy insights opinion poll, karnataka elections 2018, congress, bjp, jds-bsp, siddaramaiah, bs yeddyurappa, PM Modi, politics

With just under a month to go for the Karnataka polls scheduled to take place on May 12, an opinion poll conducted by India Today-Karvy Insights, claims that the results will see a hung Assembly.

కాంగ్రెస్ పై వ్యతిరేకత లేదు, కానీ.. హంగ్: ఇండియా టుడే

Posted: 04/14/2018 12:59 PM IST
Hung assembly in karnataka says india today pre poll

మే 12న కర్ణాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో అదికారం మాత్రం ఎవరికీ అట్టే సొంతం కాదని, హాంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఇండియా టుడే ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. ఇదే నెల అరంభంలో వచ్చిన మరో సర్వేలో పదింట ఏడుగురు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రీఫోల్ సర్వేకు, ఇండియా టుడే సర్వేకు ఏమాత్రం పొంతన లేకున్నా.. ఇండియా టుడే సర్వే మాత్రం రాజకీయ పార్టీలలో కలవరానికి కారణమవుతుంది.

కర్ణాటకలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ కు దక్షిణభారత సత్తా చాటాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కృషిసలుపుతున్న క్రమంలో.. సర్వే ఫలితాలు మాత్రం కొంత భిన్నంగా రావడం.. మరింత శ్రమించేట్లు చేస్తుంది. అయితే అధికారంలోకి రాకపోయినా అతిపెద్ద పార్టీగా మాత్రం కాంగ్రెస్ అవతరిస్తుందని ఇండియా టుడే-కార్వీ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 113 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్‌ 90-101, బీజేపీ 78-96 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. బీఎస్పీ-జేడీఎస్ 34 నుంచి 43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనున్నట్టు సర్వే తెలిపింది. ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఇస్తారని ప్రశ్నించగా 33 మంది సిద్ధరామయ్యకు ఓటేశారు. యడ్యూరప్పకు 26 శాతం మంది, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతు పలికారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌పై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు వచ్చే అవకాశం లేదని ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. లింగాయత్‌ల మైనారిటీ హోదా బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం 40 సీట్లున్న జేడీఎస్ మాత్రం తన సీట్లను కాపాడుకోనుందని తెలిపింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. 62 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 38 శాతం పట్టణాల్లో సర్వే చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు రెండోసారి అవకాశం ఇవ్వాలని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka elections  india today  pre poll survey  Siddaramaiah  Congress  BJP  Yeddurappa  politics  

Other Articles