అవినీతిరహిత పాలన అందిస్తున్నామని ఓ వైపు ప్రకటిస్తూనే.. అవినీతి అరోపణలు చుట్టిముట్టిన తమవారిని మాత్రం అందలం అందించే పార్టీ ఏదైనా వుందా..? అంటే సమాధానం చెప్పనక్కర్లేని పరిస్థితి వచ్చేస్తుంది. సాక్షాత్తు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జైషా.. స్థాపించిన కంపెనీ కోట్లు రూపాయల అర్ఢర్లు ఎలా వచ్చాయన్న విషయంలో అభియోగాలు వస్తే సీబిఐ విచారణ జరగదు. సరికదా దేశం ఈ అంశాన్ని మర్చిపోయేందుకు మరో అంశం తెరపైకి వస్తుంది. ఇది తమవరకు వస్తే.. ఇక తమ పార్టీ వరకు వస్తే మాత్రం అంశమే మరోలా వుంటుంది.
ఓ వైపు అవినీతి అంటూ గగ్గోలు పెడుతూనే అవినీతి సామ్రాటులుగా కీర్తిగడించి.. బంగారు సింహాసనాలు చేయించుకు కూర్చోనే.. బంగారు కంచాల్లో తప్ప బోజనం చేయని వారిగా చెప్పుకోబడిన అవినీతి సముద్రపు రారాజులకు కర్ణాటక ఎన్నికలలో టికెట్లు దక్కాయి. నోట్ల రద్దు వ్యవహార దేశమంతా కరెన్సీ కష్టాలకు అలల్లాడిపోతున్న వేళ.. రంగరంగ వైభవంగా తన కూతురు వివాహం చేసి.. ఔరా అనిపించుకున్న అక్రమ గనుల వ్యవహారంలో జైలుపాలై. బెయిలుపై బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి మాత్రం బీజేపి ఏకంగా టోకున సీట్లను సమర్పించేసుకుందన్న వార్తలు వినిబడుతున్నాయి.
సిద్దరామయ్య అవినీతిపరుడు అంటూ ఆయన ప్రభుత్వం గత మూడు నెలల కాలంగా కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లులపై నివేదికను ఇవ్వాలని ఏకంగా సీబిఐ రాష్ట్ర సీఎస్ రత్నకుమారీకి నోటీసులు కూడా జారీ చేస్తూనే.. వారు మాత్రం అవినీతి సామ్రాటలైన వారికి ఏరి కోరి మరీ సీట్లు ఇవ్వడం.. బీజేపీ అవినీతి డొల్లతనం మొత్తం బయటపడుతుంది. నోట్ల రద్దు సమయంలో తన కూతురి వివాహం నేపథ్యంలో నోట్లను ఏకంగా ట్రెజరీ కార్యాలయంలోనే మార్చుకున్నారని, అవి తీసుకురావడంలో 8 లక్షలు మిస్ కావడంతో తనను చిత్రహింసలు పెడుతున్నారని, డ్రైవర్ అత్మహత్య చేసుకున్నా.. ఆ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియదు.. కానీ అతడు చేసిన అరోపణలపై కూడా ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో కూడా మిస్టరీగా మారింది.
అవినీతి సహించమంటూ ఓ వైపు బీహార్ లో అర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను జైళ్లో పెట్టించిన మోడీ ప్రభుత్వం.. అదే తమ పార్టీలో మాత్రం అవినీతిపరులను పెంచిపోషిస్తున్నారు. మరీ ముఖ్యంగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలలో అవినీతి పరులకు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా అదే అరోపణలు ఎదుర్కోన్న యడ్యూరప్పను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించడం కూడా విమర్శలకు దారితీస్తుంది. ఇక అత్యంత ముఖ్యంగా గాలి జనార్థన్ రెడ్డి సూచించిన ఏకంగా తొమ్మిది మందికి పార్టీ అధిష్టానం టిక్కెట్లు కేటాయించదన్న వార్తలు మీడియాలో రావడంతో.. అసలు పార్టీలో అవినీతిపరులకే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
బీజేపీ ఇంతవరకు ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఆయన సూచించిన వారికే టికెట్లు దక్కయన్న వార్తలు వినబడుతున్నాయి.. ఎంపీలు ఈసారి శాసనసభ ఎన్నికల బరిలోకి నిలచేందుకు ప్రయత్నించినా.. కుదరదని చెప్పిన అధిష్ఠానం.. గాలికి అత్యంత సన్నిహితుడైన బళ్లారి ఎంపీ శ్రీరాములుకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఆయనకు మొళకాల్మూరు టికెట్‌ను కేటాయించగా.. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డికి బళ్లారి సిటీ టికెట్ కేటాయించారు. బళ్లారి టికెట్ ను సణ్ణఫక్కీరప్పకు, సిరిగుప్ప టికెట్ ను ఎం.ఎస్.సోమలింగప్పకు, హగరిబొమ్మనహళ్లి టికెట్ నేమిరాజ్ నాయక్ కు కేటాయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more