Pawan Kalyan with Cameraman Twitter పచ్చమీడియాను బ్యాన్ చేయండి: పవన్ కల్యాన్

Pawan kalyan targets real agyanthavasi behind the episode

Jana sena, Pawan Kalyan, twitter, transperancy politcis, corrupted parties, andhra pradesh, politics

Janasena Supremo took to Twitter to beat the hell out of people, who he believes are conspiring against him.Read more at telugu360: Pawan Kalyan with Cameraman Twitter! https://www.telugu360.com/?p=174766

న్యాయపోరాటానికి పవన్ రెడీ.. సంయమనం పాటించాలని పిలుపు

Posted: 04/21/2018 12:01 PM IST
Pawan kalyan targets real agyanthavasi behind the episode

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుట్టు వెనుకనున్న దుష్టచతుష్టయం వీళ్లేనంటూ క్రితం రోజున వరుస ట్విట్లతో బయటపెట్టిన పనవ్..వీళ్లే తన తల్లిని  విమర్శించారని ఆరోపిస్తూ, ఫిల్మ్ చాంబర్ కు వచ్చి దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్, ఈ దుష్టచతుష్టయానికి చెందిన మీడియాను బ్యాన్ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. టీవీ9, టీవీ5, ఏబిఎన్ ఛానెల్ లను నిషేధించాలని తన అభిమానులకు చెప్పారు.

అంతేకాదు. తనపై టీవీ9 ఓనర్ శ్రీని రాజు పరువునష్టం దావా వేస్తున్నారని, తాను కూడా మీడియా ఛానల్ అధినేతలపై సుదీర్ఘమైన న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నానని చెప్పారు. అయితే కార్యకర్తలు, అభిమానులు ఎవరూ హింసాయుత కార్యక్రమాలకు పూనుకోవద్దని చెబుతూనే అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఇక తాజాగా ఇవాళ తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా మెసేజ్ లు పెడుతున్నారు. నిజమైన 'అజ్ఞాతవాసి' అని ఓ వ్యక్తిని అభివర్ణిస్తూ, ఆయన్ని లక్ష్యంగా చేసుకుని, అతనో బ్లాక్ మెయిలర్ అని, ఈ విషయాన్ని ఓ సీఎం తన మంత్రి వద్ద అన్నారని పవన్ తన ట్వీట్లలో పేర్కోన్నారు.

తాను హైదరాబాద్ లో ఉన్నానని, "నిజాలను నిగ్గు తేలుద్దాం" ప్రోగ్రాం నుంచి తాను లైవ్ లో అప్ డేట్స్ ఇస్తానని, అన్నారు. మరో ట్వీట్ లో  "నాకు ఇష్టమైన స్లోగన్ 'ఫ్యాక్షనిస్టుల ఆస్తులని జాతీయం చెయ్యాలి'... అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?" అని ప్రశ్నించారు. అంతకు కొన్ని నిమిషాల ముందు నిజమైన 'అజ్ఞాతవాసి' మీకు ఎవరో తెలుసాః అని ఇంకో ట్వీట్ పెట్టారు. ఆపై మరో ట్వీట్ లో"స్టే ట్యూన్డ్ టూ 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' ప్రోగ్రామ్ నుంచి - పవన్ కల్యాణ్ విత్ కెమెరామెన్ ట్విట్టర్" అంటూ మరో ఆసక్తికర ట్వీట్ వదిలారు. పవన్ తదుపరి ఏం చెప్పబోతారన్న ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana sena  Pawan Kalyan  twitter  transperancy politcis  corrupted parties  andhra pradesh  politics  

Other Articles