బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా రెండు సీట్ల నుంచి ప్రస్తుతం మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అనేక మంది సీనియర్ నేతల కృషి, పట్టుదల, నిబద్దత వున్నాయనడంలో సందేహమే లేదు. అయితే వారిలో కూడా అత్యంత కీలక పాత్ర పోషించి బీజేపి హాయంలో కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఒకరు. కాగా ఆయన ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక తాను పార్టీలో మనజాలలేని అసహనంతో బీజేపికి గుడ్‌బై చెప్పేశారు.
బీజేపిలో అప్పటి పార్టీ నేతలతో కలసి పనిచేసిన సోషల్ మీడియా సెల్ హెడ్ గా కొనసాగిన అమిత్ మాలవ్యా రాజీనామా చేసిన తరువాత.. గత ఒకక్కరుగా పార్టీ నేతలు, ఎంపీలు కూడా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దళిత ఎంపీలు పబ్లిక్ గా తమ జాతి కొసం ప్రధాని కానీ, పార్టీ కానీ చేసిందేమీ లేదని పబ్లిక్ గానే చెప్పడం.. కూడా చర్చలకు దారితీసింది. అప్పటి పరిస్థితులు ప్రస్తుత పార్టీలో లేవని మాలవ్యా కూడా అరోపించారు.
అయితే తాజాగా గత కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న యశ్వంత్ సిన్హా.. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోననీ స్పష్టం చేసిన ఆయన.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాలతో కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ...
‘‘బీజేపీతో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు ఇదే వేదికగా ప్రకటిస్తున్నాను. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కేంద్రం వైఖరే కారణం. ప్రధాని మోదీ కనీసం ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి ఎందుకు చర్చించలేకపోయారు..’’ అంటూ ఆయన నిలదీశారు. కాగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలతో తాను సమావేశం నిర్వహించనున్నాననీ... ప్రత్యమ్నాయ రాజకీయ వేదిక కోసం చర్చిస్తానని ఆయన ప్రకటించారు.
2016 నవంబర్ తర్వాత పెద్ద నోట్ల రద్దు సహా కేంద్రం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన ఇటీవల ‘రాష్ట్ర మంచ్’ పేరుతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు. మరో బీజేపీ అసమ్మతి నేత శతృఘ్ను సిన్హా సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఇందులో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ లో అనుసరించాల్సి వ్యూహంపై ‘రాష్ట్ర మంచ్’ వేదికగా నేతలు చర్చలు జరపనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more