వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కోసమే తనకు మంత్రి పదవినిచ్చి తన క్యాబినెట్లో పెట్టుకున్నారా..? అని సందేహాలకు తెరతీసేట్లుగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యవహరశైలి వుందన్న విమర్శలు ఎన్ని వచ్చినా.. వాటిని లక్ష్యపెట్టని పార్టీ, పాలక ప్రభుత్వం.. ఆయన చెబుతున్న దాంట్లో తప్పేముంది.? అన్ని ఓ వర్గంవారు ప్రశ్నించేట్లుగా చేస్తున్నాయి. అలాంటి మంత్రివర్యులు మరోమారు అత్యంత సున్నితమైన, యావత్ దేశం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న కఠువా రేప్ కేసు ఘటనపై కూడా మరోసారి నోటికి పనిచెప్పారు.
ఈ హత్యాచారం ద్వారా హిందువులను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ గేమ్ ప్లాన్‌లో భాగంగానే ఈ కేసుపై రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఇటీవల కొందరు మానవ మృగాలు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడి, చంపేసి సమీప అడవుల్లో పడేశారు. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు సైతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో నిన్న బీహార్‌లోని తన సొంత నియోజక వర్గమైన నవాడాలో కేంద్రమంత్రి గిరిరాజ్ మాట్లాడుతూ...
‘‘కఠువా కేసుతో హిందువుల ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రపన్నారు. సెక్యులరిజం పేరట కొందరు హిందువులకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు...’’ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు స్వామి అసీమానందపై ‘‘హిందూ టెర్రర్’’ ముద్ర వేసేందుకు ప్రయత్నం చేశారనీ... ఇప్పుడు కఠువా కేసు పేరిట హిందువులను కించపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా కఠువా సామూహిక అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ... నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more