16 year old gang-raped in moving car at greater Noida కదులుతున్న కారులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

16 year old gang raped in moving car at greater noida

rape, gangrape, Greater Noida, class eleven student, gang rape moving car, Knowledge Park, classmate, students, distant relative, delhi, crime

The country is still protesting over recent sexual assault cases, and another such incident has come to light, where a Class 11 student was allegedly gang-raped in a moving car in Greater Noida, near Delhi.

కదులుతున్న కారులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

Posted: 04/25/2018 07:54 AM IST
16 year old gang raped in moving car at greater noida

ఓ వైపు యావత్ దేశం.. ఉన్నావ్, కత్తువా అత్యాచార ఘటనలను ముక్తకంఠంతో ఖండిస్తున్న తరుణంలోనే దేశరాజధాని ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలికను అమె సహవిద్యార్థి, దూరపు బంధువుతో పాటు మరో అగంతకుడు.. ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ బాలిక 11వ తరగతి చదువుతోంది. ఆ యవతి ఈనెల 18వ తేదీన పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో స్కూలు బస్సు మిస్సైంది. దాంతో ఆ బాలిక ఇంటికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకుని రోడ్డుపైకి వచ్చింది. ఆ సమయంలో ఇలాంటి అవకాశం ఎప్పుడు లభిస్తుందా అంటూ గొతికాడ నక్కలాగా కాచుకూర్చున్న ముగ్గురు అమె వద్దకు వచ్చారు. వారిలో ఒకరు అమె సహ విద్యార్థి. మరోకరు అమెకు దూరపు బంధువు. ఇక మరోకరు వారి మిత్రుడు వున్నారు.

కారులో వచ్చిన ముగ్గురిలో ఇద్దరు తెలిసనవారే కావడం.. తనను ఇంటి వద్ద దించుతామని నమ్మించడంతో ఆ బాలిక కారు ఎక్కింది. అయితే కొద్దిదూరం వెళ్లాక ఆ ముగ్గురు కామాంధులు బాలికకు మత్తు పదార్థం తాగించారు. అది తాగిన వెంటనే బాలిక మత్తులోకి జారుకుంది. ఇక ఆ ముగ్గురు కావాంధులు.. ఆ బాలికపై పైశాచిక మృగాళ్ల మాదిరిగా కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

బాలికకు నోరు తెరిచి అరిచే అవకాశాం కూడా ఇవ్వకుండా నోట్లో బట్టలు కుక్కి, ఆ తర్వాత రేప్‌కు ప్రయత్నించారు. ఓ మత్తు పానీయాన్ని కూడా ఆమెకు తాగించారు. తమ కూతురు రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 2 గంటల సమయంలో నాలెడ్జ్ పార్క్ ఏరియాలో మత్తులో ఆ యువతిని గుర్తించారు. హాస్పటల్‌కు తీసుకువెళ్లి వైద్యం చేయగా, ఆమె అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు కామాంధుల కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles