tollywood heros meet at annapurna studios కీలక నిర్ణయానికి ముందు మరోమారు టాలీవుడ్ హీరోల భేటీ

Chiranjeevi organised tollywood heros meet at annapurna studios

Tollywood heros, chiranjeevi, mahesh babu, news channnels, allu aravind, sri reddy, interviews, content, annapurna studios, andhra pradesh, politics

Tollywood Megastar Chiranjeevi organised a meeting with Tollywood heros at Annapurna studios on the present situation. Expect Balakrishna, Pawan Kalyan all heros attended the meeting. They discuss latest developments in industry and to meet again in a week.

కీలక నిర్ణయానికి ముందు మరోమారు టాలీవుడ్ హీరోల భేటీ

Posted: 04/25/2018 08:38 AM IST
Chiranjeevi organised tollywood heros meet at annapurna studios

టాలీవుడ్‌లో ఇటీవల జరిగిన, జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో టాలీవుడ్ హీరోలు, ఇతర సినీ ప్రముఖులు క్రితం రోజు రాత్రి భేటీ అయిన విషయం తెలిసిందే చిరంజీవి అధ్వర్యంలోనే సమావేశమైన దాదాపుగా 25 మంది టాలీవుడ్ హీరోలు.. ప్రస్లుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించారని.. అయితే తమ ముందుకు కీలక ప్రతిపాదన విషయంలో ఒక నిర్ణయానికి రాకులేదని, అయితే మరో రెండు మూడు రోజుల్లో మరోమారు భేటీ కానున్నారని, ఆ తరువాత తమ ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని టాలీవుడ్ లో వున్న హీరోలందరితో క్రితం రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి దాదాపుగా అందరూ హీరోలు సమావేశానికి హాజరుకాగా, పవన్ కల్యాణ్, బాలకృష్ణలు మాత్రం హాజరుకాలేదని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కీలకంగా మారిన మీడియా ఛానెళ్ల బహిష్కరణ విషయమై సమావేశంలో చర్చించారని తెలుస్తుంది. టీవీ చానళ్లు మొత్తం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి, పరిశ్రమ నుంచి వాటికి ఎటువంటి సహకారం అందకుంటే దార్లోకి వస్తాయని కొందరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

కంటెంట్, ఇంటర్వ్యూలు ఇవ్వడాన్ని నిలిపి వేయాలని, వాటిని అసలు ప్రోత్సహించవద్దని ప్రతిపాదించారు. దీంతో పాటు ఇకపై పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా గ్రూపులుగా విడిపోకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో సినిమా హీరోల మధ్య ఐక్యత చలనచిత్ర పరిశ్రమలోని 24 క్రాప్ట్ వారికి.. హీరోల అభిమానులకు కూడా మంచి సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. సినీ నటి శ్రీరెడ్డి వ్యవహారం బయటకు వచ్చినప్పుడే పిలిచి మాట్లాడి ఉంటే సమస్య ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదని కొందరు పేర్కొన్నారు.

కాగా, మూడు నాలుగు గంటల పాటు సమావేశం జరిగినా తమ ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. సమావేశపు వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని సినీ ప్రముఖులు మళ్లీ రెండు మూడు రోజుల్లో మరోసారి భేటీ అవుతారని, అప్పుడే ఈ విషయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని కూడా ‘మా’ ద్వారానే వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles