పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పోలీసు బాసులే తప్పుచేస్తూ దొరికిపోతే.. తాము మాత్రం నిజాయితీగా ఎందుకు వుండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సతిని కాదని పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ కానిస్టేబుల్. వక్రమార్గంలో నడుస్తున్నవారిని సన్మార్గంలో నడింపిచేలా చేయాల్సిన చట్టానికి ప్రతినిధిగా వుంటూ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం సమంజసం కాదని తెలిసినా అదే తప్పుకు పాల్పడ్డాడు.
ఇంకేముందు భర్త వివాహేతర సంబంధం గురించి అనోటా, ఈ నోటా తెలుసుకున్న భార్య, తన తల్లిదండ్రులు, ఇద్దరు కుమార్తెలతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అతనిని ఉతికి ఆరేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మరో మహిళతో ఎలా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నావని నిలదీసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బావుజీగూడెంకు చెందిన రమేష్, మమత అనే యువతిని ప్రేమించి 2006లో వివాహం చేసుకున్నాడు.
ఆపై 2011లో ఆయనకు కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు పోలీసు స్టేషన్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా వుంటున్న ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. దీంతో అమెతో సన్నిహిత్యం పెరిగి క్రమంగా వివాహేతర సంబంధానికి కూడా దారితీసింది. ఈ క్రమంలో భార్యా బిడ్డలను నిర్లక్ష్యం చేసిన రమేష్, చేర్యాలలో అమెతోనే గడపడం ప్రారంభించాడు. ఇంటికి వెళ్లడం పూర్తిగా మానేశాడు.
దీంతో భార్యకు అనుమానం కలిగింది. అసలు విషయాన్ని ఆరా తీసిన మమత, చేర్యాలకు వచ్చి ఇద్దరూ కలిసున్న వేళ వారి బాగోతాన్ని బయటపెట్టింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని ఆరోపిస్తూ, సదరు యువతిని, రమేష్ నూ చెప్పుతో వాయించింది. ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆక్కడికి వచ్చి అందరినీ స్టేషన్ కు తరలించారు. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more