72 percent passout in AP Eamcet ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన గంటా

Ap eamcet results 2018 declared suraj krishna tops eamcet engineering

ap eamcet result, ap eamcet 2018, ap eamcet result 2018, ap eamcet 2018 result, AP EAMCET, AP EAMCET RESULTS, AP EAMCET HALL TICKET, Ganta Srinivasa Rao, Vijayawada, Engineering, Agricultue, pass out, students

The Andhra Pradesh EAMCET, result was released today by minister Ganta Srinivasa rao in Vijayawada and results are available on the official website. Bhogi Suraj Krishna, who topped JEE Mains, also topped EAMCET Engineering.

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన గంటా

Posted: 05/02/2018 12:38 PM IST
Ap eamcet results 2018 declared suraj krishna tops eamcet engineering

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేశారు. హైదరాబాదులోని 6 పరీక్షా కేంద్రాలు సహా మొత్తం 137 కేంద్రాల్లో ఎంసెట్ ను నిర్వహించగా.. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 1,90,922 మంది విద్యార్థులు హాజరవ్వగా.. అగ్రి, మెడికల్‌ పరీక్షలకు 73.373 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని మంత్రి చెప్పారు. మొత్తం 1,38,017 మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు.

కాగా ఇవాళ విడుదల చేసిన ఫలితాలలో్.. ఇంజనీరింగ్ విభాగంలో 72.28 శాతంతో లక్షా 38వేల మంది ఉత్తీర్ణత సాధించారని అలాగే అగ్రికల్చర్ విభాగంలో 87.6 శాతంతో 63,883 మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు. గత ఏఢాది కంటే ఈ ఏడాది ఫలితాల శాతం తగ్గిందని తెలిపారు. ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని మంత్రి గంటా తెలిపారు. విద్యార్థలుు ధరఖాస్తులో పేర్కోన్న మొబైల్ నంబర్లకు ర్యాంకుల వివరాలను ఎస్ఎంఎస్ ల ద్వారా పంపిస్తున్నామని తెలిపారు.

ఇంజినీరింగ్‌లో తొలి పది ర్యాంకులు..

1. బోగి సూరజ్ కృష్ణ- 95.27 శాతం
2. గట్టు మైత్రేయ-94.93 శాతం
3. లోకేశ్వర్ రెడ్డి-94.22 శాతం
4. వినాయక్ శ్రీవర్ధన్‌-94.20 శాతం
5. షేక్ వాజిద్‌-93.78 శాతం
6. బసవరాజు జిష్ణు-93.51 శాతం
7. వంశీనాథ్‌-92.86 శాతం
8. హేమంత్ కుమార్‌-92.71 శాతం
9. బొడ్డపాటి యజ్ఞేశ్వర్‌-92.67 శాతం
10. ముక్కు విష్ణు మనోజ్ఞ-92.56 శాతం

అగ్రికల్చరల్‌ అండ్‌ మెడికల్‌లో తొలి పది ర్యాంకులు..

1. జంగాల సుప్రియ-94.78 శాతం
2.గంజికుంట శ్రీవాత్సవ్‌-93.26 శాతం
3. శ్రీహర్ష-92.47 శాతం
4. గుండె ఆదర్శ్ - 92.12 శాతం
5.జానుభాయ్ రఫియా-91.95 శాతం
6. ముక్తేవి జయసూర్య-91.95 శాతం
7. నల్లూరు వెంకట విజయకృష్ణ-91.31 శాతం
8. నీలి వెంకటసాయి అమృత-91.21 శాతం
9. వీఎఎన్‌ తరుణ్ వర్మ-91.18 శాతం
10. వంటేరు వెంకటసాయి హర్షవర్ధన్‌రెడ్డి-91.16 శాతం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP EAMCET  Ganta Srinivasa Rao  Vijayawada  Engineering  Agricultue  pass out  students  

Other Articles