మహిళలు, బాలికల అత్యాచారాలపై ఉత్తరప్రదేశ్ లోని బైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితులనే అత్యాచారాలకు బాధ్యులను చేస్తూ.. ఇంకా మాట్లాడితే వారిని కన్న తల్లిదండ్రులను కూడా కారణమని ఆయన నోరు పారేసుకున్నారు. అమ్మాయిలు చేతిలో సెల్ ఫోన్లు పట్టుకోవడం కూడా అత్యాచారాలకు కారణంగా చెప్పుకోచ్చాడు. ఇక వారిని అలా రోడ్ల మీద వదిలేస్తే అత్యాచారాలు జరక్కుండా ఎలా ఉంటాయని ఎదరు ప్రశ్నించారు. ఇంతకీ ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేశారా..? అంటే తమ గూటికి చెందిన ఎమ్మెల్యేను వెనకేసుకు వచ్చేందుకని సమాచారం.
ప్రధాన మంత్రి పార్టీ నేతలకు ఇకపై అందరు నేతలు తమనోటిని అదుపులో పెట్టుకోవాలని గత నెల చివరివారంలో సూచించిన కొన్ని రోజుల తరువాతే.. పార్టీ అధినేత గీసిన లక్ష్మణ రేఖను దాటిన ఈ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రని శూర్పనఖ అంటూ వివిదాస్పద వ్యాఖ్యలు చేసి.. విపక్ష కాంగ్రెస్ ను రావణుడితో పాల్చారు. ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలు ఎలా వున్నాయో కనీసం చూసుకోని ఈయన.. పశ్చిమ బెంగాల్ లో శాంతిభద్రతలు క్షీణించాయని అందుకు కారణమైన ముఖ్యమంత్రి మమతపై నోరుపారేసుకున్నాడు.
ఇక తాజాగా.. ఉన్నావ్ ఘటనలో తమ గూటికి చెందిన పక్షైన బీజేపి ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ 15 ఏళ్ల దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారన్న అరోపణలపై పెద్దఎత్తున్న దుమారం రేగిన తరువాత.. బాధితురాలి తండ్రి లాకప్ డెత్ అయిన తరువాత కానీ స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అతనిపై కేసు నమోదు చేసి సీబిఐకి అప్పగించిన నేపథ్యంలో.. సురేంద్ర సింగ్ ఆయనను వెనకేసుకువస్తూ అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో అగని ఆయన ముగ్గురు పిల్లల తల్లిపై ఎవరైనా అత్యాచారం చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు.
పిల్లలను స్వేచ్ఛగా వదిలేయడం వల్లే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన దీనింతటికీ పిల్లల తల్లిదండ్రులే కారణమని దుమారం రేపారు. 15 ఏళ్ల లోపు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని, వారికి స్వేచ్ఛ ఇవ్వకూడదని అన్నారు. అలాగే సెల్ఫోన్లు కూడా వారికి ఇవ్వొద్దని హితవు పలికారు. పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళలపై బీజేపీకి ఉన్న గౌరవానికి ఇది ప్రత్యక్ష నిదర్శమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. రేపిస్టులకు బీజేపీ కొమ్ముకాస్తోందని విమర్శిస్తున్నాయి. ఇక నెట్ జనులు సురేంద్రసింగ్ వ్యాఖ్యలపై తీవ్రస్తాయిలో మండిపడుతున్నారు. కుల్ దీప్ సింగ్ ను అడిగితే ముగ్గురి పిల్లల తల్లిపై సామూహిక అత్యాచారం ఎందుకు చేస్తారో చెబుతారని వ్యంగ్య కామెంట్లు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చేదాకా బీజేపి నేతలు బేటీ అంటూ.. అధికారంలోకి రాగానే బ్యూటీ అంటున్నారని మరికోందరు కామెంట్లు పెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more