police dragged mla roja and arrested her వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఈడ్చుకెళ్లిన పోలీసులు..

Police dragged mla roja and arrested her at guntur ggh hospital

Roja, ysrcp, rasta roko, rape, gang rape, 9 yr old raped in dachepally, 9 yr old raped in guntur, 9 yr old raped in andhra pradesh, 9 yr old raped by rickshaw puller, Guntur, Rape, Minor girl raped, Andhra Pradesh, Protests, Girl raped in Guntur, crime

After condolencing the dachepallly rape victim in ggh hospital at guntur, YCP MLA roja along with local Mla's protested on dachepally road , was dragged by the police before her arrest.

వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఈడ్చుకెళ్లిన పోలీసులు..

Posted: 05/04/2018 11:52 AM IST
Police dragged mla roja and arrested her at guntur ggh hospital

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ దాచేపల్లి రహదారిపై వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు స్థానికులతో కలసి రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు రాస్తారోకోకు దిగిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ రాస్తారోకో నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి  వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. మహిళా ఎమ్మెల్యే  రోజాను పోలీసులు ఈ సందర్భంగా ఈడ్చుకెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి బాలిక తల్లిదండ్రులు అమెకు చెప్పారు. బాలిక అరోగ్యం విషయమై అమె స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆరోగ్యం ఎప్పటిలోగా కుదుటపడుతుందన్న వివరాలను కూడా అమె వైద్యులను అడిగారు. బాలిక తల్లిదండ్రులకు రోజా తన సానుభూతిని వ్యక్తం చేశారు. కరుడుగట్టిన మగమృగం చేసిన దారుణానికి అతడికి శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని రోజు బాలిక కుటుంబసభ్యులకు హామి ఇచ్చారు.

అనంతరం మీడియాతో రోజా మాట్లాడుతూ, బాలికకు నాలుగు కుట్లు పడ్డాయని, తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోందని చెప్పారు. మగాళ్లు అంటేనే ఆ అమ్మాయి భయపడిపోతోందని తెలిపారు. ఆసుపత్రిలోని గదిలోకి హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చినా భయంతో హడలిపోతోందని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమని అన్నారు. ఒక ముసలివాడు అమ్మాయిని గంటసేపు రేప్ చేసి పోతుంటే... మన పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  ysrcp  rasta roko  Guntur  Rape  Minor girl  Protests  dachepally  Andhra Pradesh  crime  

Other Articles