తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి. కొంత కాలం క్రితం అనారోగ్యంతో మరణించారు. కాగా, తాజాగా అతని కుమారుడు ఎస్.భార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చెన్నైలో నివాసం ఉంటున్న బార్గవ్ రెడ్డి.. వాకాడ దగ్గర రొయ్యల హ్యాచరీ ఉంది. సోమవారం రాత్రి చెన్నై నుంచి రాత్రి 11 గంటల సమయంలో పంబలి గ్రామంలోని హ్యాచరీకి వచ్చాడు. అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత.. సమీపంలోని సముద్రం దగ్గరకి వెళ్లాడు. రాత్రికి హ్యాచరీకి రాలేదు.
మంగళవారం ఉదయం నెల్లూరు జిల్లా వాకాడ సముద్రం ఒడ్డున శవమై కనిపించాడంతో.. భార్గవ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది నిర్ధారణ కాలేదు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకుంటే.. సముద్రంలోకి వెళ్లిన వ్యక్తి మరో చోటకి కొట్టుకురావాలి. అందుకు భిన్నంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
కాగా, బార్గవ్ మరణానికి కారణం ఓ కుక్కపిల్ల అని తెలుస్తోంది. సోమవారం రాత్రి పంబలికి వచ్చిన భార్గవ్, రాత్రి 11 గంటల సమయంలో సముద్రం వద్దకు వెళ్లి, ఉదయం మృతదేహమై కనిపించారు. ఓ కుక్కపిల్ల సముద్రపు కెరటాల ధాటికి కొట్టుకుపోతుండగా చూసిన భార్గవ్, కుక్కపిల్లను కాపాడేందుకు వెళ్లి కెరటాల వేగానికి సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగా, అది పూర్తయితే భార్గవ్ మరణానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అన్న విషయం వెల్లడవుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.
భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై ఇతని తండ్రి ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించిన చిత్రాలు అప్పట్లో బ్లాక్ బస్టర్. ముఖ్యంగా బాలకృష్ణ – కోడిరామకృష్ణ కాంబినేషన్ లో గోపాల్ రెడ్డి తెరకెక్కించిన సినిమాలు ట్రెండ్ సెట్టర్. అందులో మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు వంటి చిత్రాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more