దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో కర్ణాటకలోని రెండు ప్రధాన కూటములు అదేశాలను స్వాగతిస్తూనే తాము ఈ బలనిరూపణలో నెగ్గుకోస్తామని ధీమా వ్యక్తం చేశాయి. అటు బీజేపి ఇటు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తామంటే తామే గెలుస్తామని ధీమాను ప్రకటించడంతో ఇటీవల ఎన్నికలు ముగిసిన రాష్ట్రంలో రాజకీయం మరింత రసకందాయంగా మారింది. ఇక దీనికి తోడు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాత కూడా ప్రభుత్వ ఏర్పాటు.. మనుగడ సాధించే అంశంలో నెలకోన్న ఉత్కంఠకు మాత్రం బ్రేక్ పడలేదు.
ఈ క్రమంలో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప తమకు తగినంత సంఖ్యాబలం వుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం అదేశాల ప్రకారం శనివారం కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి తమ బలాన్ని నిరూపించుకుంటామని తెలిపారు. రేపు జరగనున్న విశ్వాస పరీక్షలో తాము నెగ్గుకోస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల పూర్తికాలం తాను కర్ణాటమ ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపడతానని క్రితంరోజునే చెప్పిన యడ్యూరప్ప.. తమకు మొత్తంగా 120 మంది ఎమ్మెల్యే మద్దతు వుందని కూడా చెప్పడం గమనార్హం.
ఇక దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బీజేపి బలపరీక్షలో నెగ్గుతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ప్రకటించింది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న విషయం వారికి తెలుసునని, అది రేపు ప్రపంచానికి తెలుస్తుందని పేర్కొంది. మా బలంపై సందేహం ఉన్న వారికి చెప్పేదొకటే, 'వేచి చూడండని' అని పోస్ట్ లో పేర్కొంది. ఆరు కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వచనాలు తమకు ఉన్నాయని, వారి దీవెనలను గౌరవిస్తామని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రకటించింది.
సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన కాంగ్రెస్ ఇది ప్రజాస్వామ్యాన్ని కోరుకునే దేశప్రజలందరూ స్వాగతించాల్సిన శుభపరిణామామని పేర్కోంది. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసి తమదే పైచేయిగా నెగ్గాలనుకునే పార్టీలకు ఇది చెంపపెట్టులాంటి తీర్పుని పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు మరోమారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేలా తీర్పును వెలువరించిందని కాంగ్రెస్ నేత అశ్వని కుమార్ తెలిపారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలబెట్టుకుందని చెప్పారు. అనైతిక విధానాలతో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి సుప్రీం అదేశాలు చెంపపెట్టులాంటిదని అన్నారు. రేపు జరగబోయే బలపరీక్షలో యడ్యూరప్పకు, బీజేపీకి పరాభవం తప్పదని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలపరీక్షలో గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more