తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాన అర్చకుడిగా గతకొన్ని దశాబ్దాలుగా పనిచేస్తూ దేవదేవుడి సేవలో తరిస్తున్న ఏవీ రమణదీక్షితులపై వేటు వేయడం.. ఆయన కుమారులకు వారసత్వంగా సంక్రమించే వారసత్వం ఇవ్వకపోవడంపై అర్చక సమాఖ్య మండిపడుతుంది. టీటీడీ కొత్త చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన వేళ.. పరమపవిత్రమైన ఫుణ్యక్షేత్రంలో అన్యమతప్రచారకుల ప్రాబల్యం పెరిగిపోయిందని రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో 65 ఏళ్లు నిండిన అర్చకులను పదవుల నుంచి తొలగిస్తూ టీటీడీ అఘమేఘాల మీద నిర్ణయం తీసుకుంది.
ఇక దీంతో తిరుపతిలో మీడియా అంతా ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాసేదనే భావించారో ఏమో తెలియదు కానీ ఏకంగా రమణదీక్షితులు.. అర్చకత్వ ఉద్యోగాలు కోల్పోయిన మరో ముగ్గురు అర్చకులు నేరుగా చెన్నై వెళ్లి అక్కడ పాత్రికేయ సమవేశం పెట్టి మరీ టీటీడీలో అంతర్గతంగా జరుగుతున్న పలు అంశాలను తెరపైకి తీసుకువచ్చారు. ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ బంగారం డిపాజిట్లు చేయడం.. అకౌంట్లు తెరవడం నుంచి అర్చకులకు ఆలయకమిటీకి మధ్య వైరం ప్రారంభమైంది.
తిరుమలలో దేవదేవుడికి ప్రత్యేకంగా పాలు, పెరుగు, నెయ్యి, తేనే సహా స్వామివారి సేవకు, కైంకర్యాలకు అవసరమయ్యే అన్నింటినీ తీసుకువచ్చే ప్రత్యేక వ్యవస్థ వుండగా, అన్నింటిలోనూ హెరిటేజ్ కంపెనీని విరివిగా వాడుతూ సొమ్ముచేసుకుంటున్నారన్న అరోపణలు సంధించిన క్రమంలో రమణ దీక్షితులుతో పాటు మరో ముగ్గురు అర్చకులను కూడా టీటీడీ 65 ఏళ్ల వయస్సు నిబంధనను అమలు చేసి దానినే చూపి వారిని తిరుమల నుంచి పంపేందుకు ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా రమణ దీక్షితులు అక్కడే వుంటే ఎంతకైనా ప్రమాదమని భావించిన టీటీడీ అలయ కమిటీ ఆయన అక్కడ వుండకుండా.. వారసత్వంగా అర్చకత్వం పదవులు లభించవని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై అర్చక సమాఖ్య ప్రతినిధుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధిగా కనీసం గ్రామ సర్పంచుగా కూడా గెలవని నారా లోకేష్ ను ఏకంగా ఎమ్మెల్సీ చేసి.. ఆ తరువాత మంత్రిని చేసి.. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే ప్రభుత్వం.. వారసత్వంగా శతాబ్దాలుగా సంక్రమిస్తున్న అర్చకత్వాన్ని అడ్డుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయా నేతలుగా ఎవరైనా కావచ్చునని, ఎలాంటి అర్హతలు వున్నాయని నారా లోకేష్ ను మంత్రిగా చేశారని చిలుకూరు బాలజీ దేవాలయం అర్చకులు రంగరాజన్ ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యే కూడా కానీ లోకేష్ ను మంత్రి చేసినప్పుడు.. వేదపాఠశాలల్లో వేదాలు పటించి.. ఉపనిషత్తులు నేర్చి.. మంత్రోచ్చరణలు చేసే శాస్త్రోక్తంగా పూజలు చేయడమే అర్చకత్వమని, అది అంత ఈజీ కాదని, ఇన్ని చేసినా.. అర్చకుల పుత్రులకు దశాబ్దాలుగా సంక్రమిస్తున్న వారసత్వ అర్చకత్వంపై ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని రంగరాజన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more