"will become cm only by people blessings" ప్రజలు అశీర్వదిస్తేనే సీఎం: పవన్ కల్యాన్

Will become cm only by people blessings pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in vishakapatnam says if people of andhra pradesh bless him with votes he will become the CM, not by fans slogans

ప్రజలు అశీర్వదిస్తేనే సీఎం: పవన్ కల్యాన్

Posted: 05/18/2018 03:58 PM IST
Will become cm only by people blessings pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎక్కడికెళ్లితే అక్కడ అభిమానులు చుట్టుముట్టి సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో కొంత అసహనానికి గురైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్.. మీరు నా ముందు నినదిస్తే.. తాను ముఖ్యమంత్రిని కానని.. రాష్ట్ర ప్రజలు అవకాశమిస్తేనే అవుతానని అన్నారు. అయితే తనకు ప్రజలు అవకాశమిస్తే జవాబుదారి వున్న బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని అందిస్తానని  పవన్ కల్యాణ్ అన్నారు.

అంతకన్నాముందు తాను ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రజాసమస్యలను అర్థం చేసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. నేతల స్వార్థం కోసం, వారి కుటుంబాల కోసం ప్రభుత్వాలు పని చేయరాదని... ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోరాదని సూచించారు. టీడీపీ, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయని... అందుకే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తిని తాను కాదని అన్నారు.

విశాఖలోని గంగవరం వెళ్లి పోర్టు నిర్వాసితులతో మాట్లాడిన పవన్ అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో పవన్ క్రితం రోజు సాయంత్రం విశాఖ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సామాన్యులలో ఒకడిగా వచ్చిన పవన్.. సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను వింటున్నారు. పవన్ విద్యార్థులకు సూచనలు కూడా ఇచ్చారు.. వారు జనసేనానితో ఫొటోలు కూడా దిగారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని.. పవన్ కు ఒక బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. దానిని కొద్దిసేపు పరిశీలించారు పవన్. బైక్ పై పవన్ ఫొటో, జనసేన లోగోలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  gangavaram  ichchapuram  porata yatra  bus yatra  andhra pradesh  politics  

Other Articles