Jadeja's Wife Allegedly Assaulted By Cop టీమిండియా క్రికెటర్ జడేజా భార్యపై కానిస్టేబుల్ దాడి

Cricketer ravindra jadeja s wife allegedly assaulted by cop over accident

IPL, chennai super kings, Ravindra Jadeja, sir ravindra jadeja, Ravindra Jadeja wife, Riva Solanki, Reeva solanki, reeva solanki car accident, police conistable, constable Sajay Ahir, bmw car, indian cricketer, gujarat, jamnagar, crime

Cricketer Ravindra Jadeja's wife Reeva was allegedly assaulted by a police constable following a minor accident involving her car in Gujarat's Jamnagar city, police said.

టీమిండియా క్రికెటర్ జడేజా భార్యపై కానిస్టేబుల్ దాడి

Posted: 05/22/2018 10:34 AM IST
Cricketer ravindra jadeja s wife allegedly assaulted by cop over accident

టీమిండియా క్రికెటర్, అల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్యపై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా అమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన క్రితం రోజు సాయంత్రం గుజరాత్ లోని జామ్ నగర్ పరిధిలోని సారూ సెక్షన్ రోడ్డు వద్ద జరిగింది. షాపింగ్ కని తన బీఎండ్యూ కారులో బయల్దేరిన జడేజా భార్య రీవా సోలంకి.. తానే స్వయంగా నడుపుకుంటూ వెళ్లింది. సరిగ్గా సారూ సెక్షన్ రోడ్డు వద్దకు చేరుకోగానే రాంగ్ రూట్ లో పల్సర్ బైక్ పై వస్తున్న పోలీసు కానిస్టేబుల్ సంజయ్‌ అహిర్‌ అమె వాహనం ముందుకు వచ్చి అదుపుతప్పి కిందపడ్డాడు.

అయితే ఈ ఘటనలో నేపథ్యంలో సడన్ బ్రేక్ వేసిన సోలంకీ పల్సర్‌ బైక్ ను స్వల్పంగా ఢీకొన్నింది. వెంటనే షాక్ నుంచి తేరుకుని కానిస్టేబుల్ కు దెబ్బలేమైనా తగిలాయా? విచారించేందుకు కిందికి దిగగానే.. కానిస్టేబుల్  సంజయ్ అహిర్ అమెపై తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఓ దశలో రీవా సోలంకీని జుట్టు పట్టుకుని మరీ కొట్టబోగా తాము జోక్యం కల్పించుకుని విడిపించామని, కానిస్టేబుల్ రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా మహిళలపై దాడి చేయడమేంటని కూడా ప్రత్యక్ష సాక్షులు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో స్వల్పగాయాల పాలైన రీవా సొలంకీ చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లగా.. అసుపత్రికి చేరుకున్న జామ్ నగర్ ఎస్పీ ప్రదీప్‌ కలుసుకుని పరామర్శించారు. ఆ తరువాత కానిస్టేబుల్ వ్వవహారంపై అయన స్వయంగా ఆమెను పొలిస్ స్టేషన్ కు తీసుకొచ్చి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అనంతరం పోలీసులు కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. మహిళపై దాడి చేయడం తీవ్రమైన నేరమని, దీనిపై విచారణ జరిపి సంజయ్‌ అహిర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ తెలిపారు. కాగా, 2017లో కూడా రీవా ఓ యాక్సిడెంట్‌ వివాదంలో చిక్కుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravindra jadeja  cricketer  reeva solanki  accident  constable  sanjayu ahir  jamnagar  gujarat  crime  

Other Articles