అనుమానం పాతరోగం అంటారు పెద్దలు. ఒక్కసారి అనుమానం కలిగిందా.? ఇక ఆ అనుమానం అంత సులువుగా తమను వదిలిపోదని దీనర్థం. సినిమాలు, టీవీలలో నిత్యం సీరియళ్లు చూస్తూ తమ భర్తలను అనుమానిస్తుంటారు భార్యలు. సరే వారిలో అనుమానం కలిగిందికదా అని భర్తలందరూ సక్రమంగానే వున్నా కొందరు చేసే పనులతో అందరినీ అనుమానిస్తారు భార్యలు. ఇదే కానెస్టులో పెళ్లాం ఊరెళ్తే.. తరహాలో సినిమాలు కూడా వచ్చి.. భార్యభర్తలు మధ్య అనుమానాలకు తావు వుండకూడదన్న సత్యాన్ని చాటినా.. ఈ జాడ్యం మాత్రం అంతరించిపోవడం లేదు.
ఫలితంగా గుజరాత్ లో ఈ అనుమానం బారిన పడిన ఓ భార్య చేసిన పనికి అమెతో పాటు అమె భర్త కూడా కటకటాలను లెక్కించాల్సి వచ్చింది. అదేలా అంటారా.? తమ పొరుగునే వున్న ఓ అమ్మాయితో తన భర్త సన్నిహితంగా వుండటాన్ని గమనించిన ఓ భార్య.. తన భర్తకు ఆ యువతితో అక్రమ సంబంధం వుందా అన్న అనుమానం కలిగింది. దీంతో తన అనుమానాన్ని తీర్చుకునేందుకు తెనాలి రామకృష్ణుడు నాటి కథలలో వున్న జడ్జిమెంటును తనకు బాసటగా ఎంచుకుంది. ఇది అత్యంత దారుణం అని తెలిసినా.. ఎలా చేయించిందన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకతప్పవు.
ఇంతకీ ఆ భార్య ఏం చేసింది అంటే.. తన భర్త.. పక్కింటి యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానాలు కలగడంతో.. వారి సచ్ఛీలత నిరూపించుకోవాలంటూ సూచించింది. సలసల కాగే నూనెలో ఇద్దర్నీ బలవంతంగా చేతులు పెట్టించింది. దీంతో 17 ఏళ్ల యువతితో పాటు ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లో చోటుచేసుకుంది. కాగా ఆమె భర్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ సదరు యువతి ఆరోపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దంపతులిద్దరినీ అరెస్టు చేసి పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more