amit shah satirical comments on AP, TS chief ministers అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు.. వాళ్ల ప్రచారానికి ఓట్లా.?

Denying ap special status won t hurt party amit shah

Prime Minister Narendra Modi, 2019 general elections, andhra pradesh special category status, Chandrababu, chandraShekar Rao, Telugu state, kcr campaign, cbn campaign, BJP, Amit shah, PM Modi, telangana, andhra pradesh, kerala, west bengal, Nation, India, Delhi, New Delhi, politics

Heading into the election year, the BJP is supremely confident of victory in 2019, and sees its tally going up in many states like Telangana, Andhra Pradesh, West Bengal and even Kerala.

చంద్రులపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు.. వాళ్ల ప్రచారానికి ఓట్లా.?

Posted: 05/28/2018 11:51 AM IST
Denying ap special status won t hurt party amit shah

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై బీజేపి జాతీయ అధ్యక్షడు అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ కూటమి నుంచి వెళ్లిన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులపై కూడా ఆయన చులకన వ్యాఖ్యలు చేశారు. వారు ప్రచారం చేస్తే ఓట్లు పడతాయా..? అంటూ సంచలన కామెంట్ చేశారు. వారిద్దరూ ఆయా రాష్ట్రాల్లో బలమైన నేతలని అంగీకరించిన ఆయన.. అయితే వారు వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అక్కడి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. వారి ప్రభావం మిగతా రాష్ట్రాలలో అంతగా వుండదని అమిత్ షా పేర్కోన్నారు.

అయితే కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో గతంలో దీనిని స్వాగతించిన అమిత్ షా ఈ సారి మాత్రం ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు అసాద్యమైన చర్యగా చెప్పుకోచ్చారు. ఇక అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇంతవరకూ తామిచ్చిన నిధుల్లో ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పని చంద్రబాబుకు, మరిన్ని నిధులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి పటం, ఇప్పటికీ సింగపూర్ ను దాటి బయటకు రాలేదని విమర్శించారు. చంద్రబాబుకు గుజరాత్ లో అభివృద్ధి చెందిన నగరాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గుజరాత్ నగరాలన్నీ రాష్ట్ర నిధులతోనే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. కేంద్రం నుంచి నగరాల నిర్మాణానికి గుజరాత్ సర్కార్ ఎన్నడూ డబ్బులు తీసుకోలేదని అన్నారు.

ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 2,100 కోట్లను ఇచ్చిందని, వాటి లెక్కలు ఇంతవరకూ కేంద్రానికి చేరలేదని, ఆ పరిస్థితుల్లో మరిన్ని డబ్బులు ఎలా ఇస్తారని అడిగారు. ఒక్క భవన నిర్మాణానికైనా టెండర్లు పిలిచారా? అని అమిత్ షా ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే స్వీయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు కావని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించిన ఆయన, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీకి ఎటువంటి నష్టమూ లేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లనున్నామని, కొత్త మిత్రపక్షాలేమీ ఉండబోవని అమిత్ షా వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles