Rahul accompanies Sonia for medical-check up విమర్శించకుండా ముందుజాగ్రత్తగా వ్యవహరించిన రాహుల్

Rahul gandhi to accompany sonia during her medical check up abroad

Sonia Gandhi, upa, Rahul Gandhi, Congress, PM Modi, amit shah, twitter, floor test, congress, JDS, deva gowda, karnataka, politics

UPA chairperson Sonia Gandhi, accompanied by her son and Congress president Rahul Gandhi, will leave for abroad tonight for a medical check-up.

విమర్శించకుండా ముందుజాగ్రత్తగా వ్యవహరించిన రాహుల్

Posted: 05/28/2018 03:01 PM IST
Rahul gandhi to accompany sonia during her medical check up abroad

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్, ఆ తరువాత కర్ణాటక విజయాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. గతంలో ఆయన తనకు జరిగిన అనుభవాలను పునరావృతం కాకుండా ప్రత్యర్థి పార్టీలను ఢిఫెన్సులో పడేసేలా ట్వీట్లు పెడుతూ అకట్టుకుంటున్నాడు. గతంలో ఆయన విదేశాలకు వెళ్లిన సమయంలో బీజేపి రాహుల్ గాంధీ కనిపించడం లేదని సోషల్ మీడియాలో కొడై కూసి.. యావత్ దేశం ప్రజల దృష్టిని మొత్తం రాహుల్ గాంధీవైపు తిప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి అప్రమత్తతో వ్యవహరించారు రాహుల్.

తాను విదేశాలకు వెళ్తున్నానని.. కొన్ని రోజులు అక్కడే ఉండనున్నానని, ఇక తనను విమర్శించేందుకు ప్రత్యర్థి పార్టీలు ఎక్కువగా కష్టపడవద్దని కూడా చెప్పారు. అయితే వెళుతూ వెళుతూ సోషల్ మీడియాను ద్వారా అధికార బీజేపి పార్టీకి, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ స్టాప్ కు గట్టిగానే చురకలు అంటించారు. గతంలో ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేయని రాహుల్.. ఈసారి చెప్పి మరీ.. గిల్లీ వెళ్లటం విశేషం. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కామెడీ సెటైర్లతో హడావిడి అవుతోంది. ఇంతకీ ఆయన బీజేపి ట్రాలింగ్ టీమ్ ను ఎలా చురకలంటించారో తెలుసా.?

‘‘నేను కొన్ని రోజులు విదేశాలకు వెళ్తున్నాను. తల్లి సోనియాగాంధీ వార్షిక అరోగ్య పరీక్షల నిమిత్తం రెగ్యులర్ చెకప్ లో భాగంగా వెళ్తున్నాను. నా మిత్రులైన బీజేపీ సోషల్ మీడియా ట్రోల్ ఆర్మీకి ఒకటి చెప్పదలచుకున్నాను. మీరు మరీ ఎక్కువగా కష్టపడొద్దు.. నేను అతి త్వరలోనే వచ్చేస్తాను అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి వచ్చిన ఈ పంచ్ కు కౌంటర్ వేయటానికి బీజేపీ కొంచెం సమయం తీసుకుంది. కానీ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది.

అమ్మ సెంటిమెంట్ తో విదేశాలకు వెళ్లిన రాహుల్ ట్వీట్ కు బీజేపి డైలిమాలో పడింది. బదులివ్వాలా..? లేదా..? దీంతో కొంచెం సమయం తీసుకున్న తరువాత మాత్రం మళ్లీ కౌంటర్ ఇచ్చింది. సోనియాగాంధీ వెంటనే కోలుకోవాలని ఆశిస్తున్నాం.. అంటూనే అయితే కర్నాటకలో ఇంకా మంత్రివర్గం కొలువుదీరలేదు. పొత్తులు ఖరారు కాలేదు. ప్రజలు కూడా ప్రజాపాలన కోసం ఎదురుచూస్తున్నారు. మీరు వెళ్లేలోపు పని చేసే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అంటూ కర్నాటక ఇష్యూను హైలెట్ చేసింది. ఇదెలాగున్నా.. రాహుల్ బీజేపిని గిల్లి మరీ వెళ్లడాన్ని మాత్రం నెట్ జనులు స్వాగతిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia Gandhi  upa  Rahul Gandhi  Congress  PM Modi  amit shah  twitter  floor test  congress  JDS  deva gowda  karnataka  politics  

Other Articles