తప్పులు చేయడం.. వాటిని సరిచేయడానికి ఈజీ మనీ కోసం వెంప్లరాడట.. అత్యాశపరులను నేరప్రవృత్తి వైపు బాటలు వేసేలా చేస్తుంది. ఫిల్మ్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన అదృష్టం దారిమళ్లితే.. పేరొందిన ప్రముఖ ఎడిటర్ గా మారే అవకాశాన్ని జారవిడుచుకుని తప్పులు చేసి.. తానిని సరి చేసుకునేందుకు మరో తప్పు చేసి.. ఇలా ఒకదానిపై మరోకటి చేస్తూ చివరకు పోలీసులకు చిక్కి కటకటాలను లెక్కబెడుతున్నాడు. సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి మోసాలకు పాల్పడి అమెకు కూడా అరదండాలు వేయించాడు.
రాచకొండ కమిషనరేట్ పోలీసుల కథనం ప్రకారం.. చింతల్‌కు చెందిన సలిమిడి నవీన్ రెడ్డి ఓ సంస్థలో ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. వివాహమై ఇద్దరు పిల్లలున్నా, మరో మహిళతో సహజీవనం చేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. రెండు కుటుంబాలను పోషించడం కష్టంగా మారడంతో ఈజీ మనీ కోసం నవీన్ రెడ్డి వేట ప్రారంభించాడు. అతని బుర్రకు సైబర్ నేరాగాళ్లు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారన్న ఐడియా తట్టింది.
సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి సోషల్ మీడియాలో చాటింగ్ చేసి అమాయకులను బుట్టలో పడేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. అదే సమయంలో ఓ చాట్ రూం వెబ్‌సైట్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించడంతో రంగంలోకి దిగాడు. మహిళతో చాటింగ్ చేయించాడు. తర్వాత అతడి నెంబరు తీసుకుని వాట్సాప్‌లోనూ చాటింగ్ మొదలుపెట్టారు. ప్రేమగా మాట్లాడుతూ మొత్తానికి అతడిని బుట్టలో పడేశారు. ఈ క్రమంలో తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయని, రెండుమూడు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికి ఆమె రూ.20వేలు తీసుకుంది.
కొన్ని రోజుల తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు ఒత్తిడి తీసుకురావడంతో విజయవాడలో ఉన్న తన స్థలాన్ని విక్రయిస్తున్నానని, రిజిస్ట్రేషన్ కోసం రూ.2 లక్షలు అవసరముందని, ఆ డబ్బులు సర్దితే రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పింది. దీంతో రూ.1.80 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేశాడు. ఆ తర్వాతి నుంచి ఆమె ఫోన్ నంబరు పనిచేయడం మానేసింది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more