తెలంగాణ ఏర్పడితేనే మన రాత మారుతుందని పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకుని నాలుగేళ్లలోనే బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నామని.. ఆ దిశగా సాగుతున్న పయంలో మరికొన్నేళ్ల వ్యవధిలోనే గమ్యాన్ని చేరుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఘననివాళులు అర్పించారు. ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని పెంచుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పేద ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. వసతి గృహ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. వ్యవసాయ పరికరాలకు రాయితీ ఇచ్చామన్నారు. నీటి తీరువా, ట్రాక్టర్లపై వాహన పన్ను రద్దు చేశాంమన్నారు. తెలంగాణ ఏర్పాడిన తరువాత నాలుగేళ్లలోనే 520 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి.. విద్యాభివృద్దితో పాటు మానవ వనరుల పెరుగుదలకు తమ ప్రభుత్వం దోహదం చేసిందన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులపై అప్పటి పాలకులు శీతకన్ను వేశారని అరోపించారు. తెలంగాణ బంగారం అని తెలుసుకున్న పాలకులు తెలంగాణ వాడు వృద్ది చెందకుండా ప్రాజెక్టుల డిజెన్ల వద్ద నుంచే వివాదాస్పదం చేశారని, పక్కరాష్ట్రల వారు కోర్టులకు వెళ్లి ప్రాజెక్టు పనుల అడుగకు కూడా ముందుకు పడకుండా అడ్డుకునేలా చేశారని కేసీఆర్ తీవ్రంగా అక్షేపించారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా జలాలు పొలాల్లో పారేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనప్రదాయినిగా మారనుందని కూడా కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని రైతంగానికి ఎంత చేసినా తక్కువనే అన్న కేసీఆర్.. వారి సంక్షేమానికి ఎంతో చేయాలని వుందని అభిలాషను వ్యక్తం చేశారు. రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా అమలు చేస్తున్నామని.. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం కాకుండా వుండేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, అయితే ఈ పథకం కోసం వారి నుంచి రూపాయి తీసుకోలేదని చెప్పారు. భూముల వివరాలు పారదర్శకంగా ఉండే ధరణి వెబ్సైట్ రూపొందించామని చెప్పారు.
‘రైతు బంధు పథకంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు. సాగుపెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయాల్సిన వచ్చిన పరిస్థుల నుంిచ వారిని అదుకుని ఆ పెట్టుబడి ప్రభుత్వమే కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలనేదే నా లక్ష్యమన్నారు. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడిసాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించిందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more