ఓ వైపు తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంత చేసిన తక్కువగానే అనిపిస్తుందని, వారికి ఇంకా ఎంతో చేయాలని తన మనస్సు పరితమిస్తుందని వ్యాఖ్యలు చేయగా, అదేలా కర్ణాటకలో తాజామాజి మఖ్యమంత్రి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందు రైతుల రుణమాఫీలను చేయాలన్న డిమాండ్ ను వుంచి ఏకంగా ప్రభుత్వం కూడా కొలువుదీరక ముందే రాష్ట్ర బంద్ కు పిలుపినిచ్చి .. తమ బీజేపి పార్టీ రైతుల కోసమేనన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేసింది.
కానీ అదే బీజేపి ప్రభుత్వం అధికారంలో వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏకంగా రైతులకు అసలు సమస్యలేమీ లేవని వివాదాస్పద వ్యాక్యలు చేశారు. దేశ ప్రజలకు అన్నం పెడుతోన్న రైతన్నలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'వారికి ఎటువంటి సమస్యలు లేవు.. అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారు.. వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించకపోతే రైతులకే నష్టం' అని చౌవకబారు వ్యాఖ్యుల చేశారు.
కాగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు క్రితంరోజున.. పది రోజుల ఆందోళనను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై కూరగాయలు, పాలు పారబోసి నిరసన తెలిపారు. ఈనెల 10న భారత్ బంద్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి రాష్ట్రప్రభుత్వాలకు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం వారికి పరిహారాలు కల్పించాలని కూడా అదేశించినా ఇక్కడి ప్రభుత్వాలు స్పందించలేదు. అయితే హర్యానా సీఎం ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు వారికి మరింత ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.
#WATCH: Haryana CM Manohar Lal Khattar speaks on farmers' strike, says, 'they don't have any issues, they are just focusing on unnecessary things, not selling produce will bring losses to farmers.' (01.06.2018) pic.twitter.com/CFY7dzgj2g
— ANI (@ANI) June 2, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more