యావత్ దేశ ప్రజలతో పాటు విదేశీయుల అభిమానాన్ని కూడా చూరగొన్న బీజేపి సీనియర్ నాయకురాలు.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయాణిస్తున్న విమానం పద్నాలుగు నిమిషాల పాటు జాడ లేకుండా పోయిందన్న వార్తతో ఒక్కసారిగా భారతీయు ప్రజలను కలవరానికి గురిచేసింది. దీంతో.. కేంద్ర విమానాయాన శాఖ అధికారులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. రైల్వే శాఖ మంత్రిగా నూతన సంస్కరణలకు తెరతీసిన సురేష్ ప్రభు నేతృత్వం వహిస్తున్న కేంద్ర విమానయాన శాఖ పగ్గాలు చేపట్టిన అనంతరం.. ఈ ఘటన చోటుచేసుకోవడంతో అందరిలోనూ తీవ్ర అందోళన మొదలైంది.
బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు త్రివేండ్రం నుంచి మారిషస్ మీదుగా సుష్మ స్వరాజ్ దక్షిణాఫ్రికాకు ప్రయాణమయ్యారు. సాయంత్రం 4 గంటలకు త్రివేండ్రం విమానాశ్రయంలో ఆమె ప్రయాణిస్తున్న మేఘదూత్ విమానం టేకాఫ్ అయ్యింది. త్రివేండ్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) పరిధి నుంచి మారిషస్ ఏటీసీ కంట్రోల్లోకి సుష్మ విమానం ప్రవేశించిన తర్వాత 12 నుంచి 14 నిమిషాల పాటు ఈ రెండు ఏటీసీలతో పైలెట్లు కాంటాక్ట్‌లోకి రాలేదు. ఎంతకు విమానం జాడ తెలియరాకపోవడంతో.. మారిషస్ ఏటీసీ అధికారులు ఎమర్జెన్సీ అలారాన్ని మోగించారు.
తమ దేశ వైమానిక దళాన్ని అప్రమత్తం చేశారు. అయితే సాయంత్రం 4.44 గంటలకు సుష్మా స్వరాజ్ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో అనుసంధానం అయ్యింది. దీంతో విమానయాన శాఖ అధికారులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సముద్ర పరివాహక ప్రాంతాల మీదుగా ప్రయాణించేటప్పుడు రాడార్ కవరేజ్ ఉండదు. సముద్రంలో ద్వీప సమూహంతో ఉన్న మారిషస్ ఏటీసీ కంట్రోల్ పరిధిలో గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగినట్లు సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అయితే సుష్మాస్వరాజ్ విమానం ఏటీసీతో అనుసంధనం కావడం అమె అభిమానుల కలవరాన్ని దూరం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more