ఇప్పటికీ గ్రామాల్లోని చిన్నపిల్లలు ఎక్కువగా అడే అట దొంగా పోలీస్. పోలీస్ వస్తున్నాడంటే దొంగలు దాచుకునేవాళ్లు. అయినా దొంగలను గుర్తించి బంధించడం పోలీసుల పని. ఈ సత్యం రమారమి అందరికీ తెలిసిందే. దొంగలు పోలీసు కానిస్టేబుల్ వున్న పరిసర ప్రాంతాల్లోకి కూడా దొంగతనానికి వెళ్డడు. అయితే మధ్యప్రదేశ్ లోని దొంగలు మాత్రం బరితెగించిపోయారు. ఏకంగా పోలీస్ క్వార్టర్స్‌లో ఉండే ఎస్పీ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ ఎస్పీ ఇంట్లో ఉండటంతో ఆయనను గదిలోనే బంధించి.. పనికానించేశారు. ఒకరు కాదు నలుగురు దొంగలు ఇలా చేసి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. కాగా ఒక్కడు మాత్రం పోలీసులకు చిక్కాడు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా ఎస్పీ సునిల్ రాజోరి ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. వేకువజామున 2 గంటల సమయంలో ఇంటి చుట్టూ వున్న ఫెన్సింగ్ ను కట్ చేసి.. కిటికీ ఊచలు తొలగించి.. వెనుక భాగం గుండా తన ఇంట్లోకి దొంగలు ప్రవేశించారని తెలిపారు. మొత్తంగా నలుగురు దొంగలు రాగా, వారిలో ఇద్దరు బయట పహారాగా వున్నారని, మరో ఇద్దరు లోనికి ప్రవేశించారన్నారు. తన భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లడంతో ఆ సమయంలో ఎస్పీ, అతడి తల్లి, తమ్ముడు, సోదరి, ఆమె కుమారుడు ఇంట్లో ఉన్నారు. ముందు ఎస్పీ తల్లి గదిలోకి ప్రవేశించిన దొంగలు, ఆమె పర్సులో ఉన్న డెబిట్ కార్డులు, నగదును తస్కరించారు.
అనంతరం ఎస్పీ నిద్రపోతున్న గదికి బయట నుంచి గడియపెట్టారు. తర్వాత హాల్లో నిద్రిస్తోన్న తల్లి, సోదరిల దగ్గరకు వెళ్లేసరికి వారికి మెలకువచ్చింది. తక్షణమే సోదరి అతడికి ఫోన్ చేయగా, తల్లి ఎమర్జెన్సీ బెల్ మోగించి అప్రమత్తం చేసింది. దీంతో లోపలి నుంచి రావడానికి తాను ప్రయత్నించగా గడియవేసి ఉందని ఆయన తెలియజేశారు. వెంటనే తన సోదరికి ఫోన్ చేసి హాల్ తలుపులు మూసేయమని ఆదేశించాడు. నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు లోనికి ప్రవేశించగా, మరో ఇద్దరు బయటే కాపాలగా ఉన్నారని, బయట ఉన్నవారిని తాను సరిగ్గా చూడలేదని పేర్కొన్నారు. దీని గురించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో 20 నిమిషాల్లో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
పోలీసుల అలకిడి విని ముగ్గురు దొంగలు తప్పించుకోగా, లోపలి ఉండిపోయిన ఒక్కడు మాత్రం పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాను ఖర్గోన్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అతడు విచారణలో వెల్లడించాడు. ఎస్పీ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటాయనే ఉద్దేశంతోనే దొంగతనానికి వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. వారికి ఎలాంటి విలువైన వస్తువులు లభించకపోవడంతో తమ వెంట తెచ్చుకున్న బ్యాగులను బయటే వదిలేసి పారిపోయారు. అంతేకాదు ముందుజాగ్రత్తగా ఇంటి పరిసరాల్లో సీసీటీవీ వైర్లను సైతం కత్తిరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more